న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ... ధోని అంత గొప్ప కెప్టెన్ కాదు: షాహిద్ అఫ్రిది

Virat Kohli Not a Good Captain As MS Dhoni | Oneindia Telugu
Virat Kohli Not As Good As MS Dhoni Yet As Captain, Says Shahid Afridi

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం కోహ్లీ నేర్చుకునే దశలోనే ఉన్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ఇక, కెప్టెన్సీ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోని నుంచి కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలానే ఉందని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

<strong>India vs Australia 2nd T20I: వర్షం దెబ్బకు మ్యాచ్ రద్దు</strong>India vs Australia 2nd T20I: వర్షం దెబ్బకు మ్యాచ్ రద్దు

తాజాగా అఫ్రిది ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో "కోహ్లీ నా ఫేవరెట్ బ్యాట్స్‌మన్. కానీ కెప్టెన్సీ విషయంలో ధోనీనే బెస్ట్. విరాట్ ఇంకా చాలా నేర్చుకోవాలి" అని అఫ్రిది అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై కూడా అఫ్రిది స్పందించాడు. ఆసీస్ గడ్డపై గెలవాలంటే టీమిండియా బ్యాట్స్‌మెన్ తమ సామర్థ్యానికి మించి ప్రదర్శన చేయాల్సి ఉంటుందని అఫ్రిది అన్నాడు.

1
43621
ఆసీస్ పిచ్‌లు గతంలో మాదిరి బౌన్స్‌కు అనుకూలించడం లేదు

ఆసీస్ పిచ్‌లు గతంలో మాదిరి బౌన్స్‌కు అనుకూలించడం లేదు

"ఆస్ట్రేలియా పిచ్‌లు గతంలోలా బౌన్స్‌కు అనుకూలించడం లేదని, ఇండియన్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడగలిగితే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది" అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరుగుతుంది. అనంతరం ఆసీస్ గడ్డపై టీమిండియా 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. కాగా, శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

సిరీస్‌ను సమం చేయాలంటే సిడ్నీ టీ20లో గెలవాలి

సిరీస్‌ను సమం చేయాలంటే సిడ్నీ టీ20లో గెలవాలి

సిరీస్‌ను సమం చేయాలంటే సిడ్నీ వేదికగా ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే. వర్షం కారణంగా ఆట రద్దు అవడం అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్‌ను తొలుత 19 ఓవర్లకు కుదించిన అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో మరోమారు ఓవర్లు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మైదానంలోకి అడుగుపెట్టారు.

 భారత లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించిన అంపైర్లు

భారత లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించిన అంపైర్లు

ఈ క్రమంలో మరోమారు వర్షం కురిసింది. దీంతో భారత లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. వర్షం ఆగితే స్థానిక కాలమానం ప్రకారం 22:02 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైతే కోహ్లీసేన 5 ఓవర్లకు 46 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది. ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే అంఫైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచింది.

1947 తర్వాత 11 సార్లు ఆసీస్ పర్యటనకు

1947 తర్వాత 11 సార్లు ఆసీస్ పర్యటనకు

దీంతో దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్‌కు 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 1947 తర్వాత 11 సార్లు ఆసీస్ పర్యటనకు టీమిండియా వెళ్లినప్పటికీ ఒక్కసారి కూడా ఆ గడ్డపై టెస్టు సిరిస్‌ను గెలవలేదు. దీంతో ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆ రికార్డు బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో ఈ పర్యటనలో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

Story first published: Friday, November 23, 2018, 18:02 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X