న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో ముగ్గురు బిగ్ బ్రదర్స్ ఎవరో తెలుసా?: చాహల్ వెల్లడి

India vs Australia 2018 : Dhoni,Kohli,Rohith Are Like Big Brothers In Team India : Chahal| Oneindia
Virat Kohli, MS Dhoni and Rohit Sharma are the three big brothers in the Indian team: Yuzvendra Chahal

హైదరాబాద్: టీమిండియా ఒ కుటుంబంలా ఉంటుందని చైనామన్ స్పిన్నర్ రోహిత్ శర్మ అన్నాడు. నవంబర్ 21న జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో యజువేంద్ర చాహాల్ మీడియాతో మాట్లాడుతూ జట్టుతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు.

భారత్ వంటి పేద దేశంలో ఎఫ్1 రేసులా?: హామిల్టన్ సంచలనం

"టీమిండియా ఒక కుటుంబంలా ఉంటుంది. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా సీనియర్లు అండగా నిలుస్తారు. ఎలాంటి ఫీలింగ్ ఉన్నాసరే, వారిలో ఎవరి దగ్గరికైనా వెళ్లి చెప్పేంత చనువు ఇస్తారు. కోహ్లీ భాయ్‌, రోహిత్ భాయ్‌, ధోని భాయ్‌ భారత జట్టులో పెద్దన్నల్లాంటివారు" అని చాహల్ అన్నాడు.

ఇంట్లో ఉన్నట్లు ఫీల్‌ అయ్యేలా

ఇంట్లో ఉన్నట్లు ఫీల్‌ అయ్యేలా

"ఓపెనర్ శిఖర్ ధావన్‌ లాంటి మరికొందరు కూడా కొత్తగా వచ్చినవారు ఇంట్లో ఉన్నట్లు ఫీల్‌ అయ్యేలా ఉండమని చెబుతారు. ఇలా ఉండటం చాలా అవసరం. ఆత్మవిశ్వాసంగా ఉండకపోతే, మైదానంలో సరైన ఆటతీరు కనబర్చలేం కదా. టీమిండియా విజయానికి ఇదే ముఖ్య కారణం" అని చాహల్ తెలిపాడు.

రోహిత్ శర్మతో చాహల్‌కు ఉన్న అనుబంధంపై చాహల్

రోహిత్ శర్మతో చాహల్‌కు ఉన్న అనుబంధంపై చాహల్

ఇక, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మతో చాహల్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై చాహల్ మాట్లాడుతూ "మైదానం బయట కూడా ధోని భాయ్‌ చాలా కలివిడిగా ఉంటారు. నా వ్యక్తిగత జీవితాన్ని కూడా పంచుకొనేంత చనువు ధోని దగ్గర ఉంది" అని అన్నాడు.

మా మధ్య ఉండే చిన్న అల్లర్లు ఎప్పటికీ

మా మధ్య ఉండే చిన్న అల్లర్లు ఎప్పటికీ

"ప్రతిసారి సాధ్యమైనంత చక్కటి పరిష్కారం చూపెడతాడు. మా మధ్య ఉండే చిన్న అల్లర్లు ఎప్పటికీ మాతో ఉండిపోతాయి"అని గతంలో ధోనితో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఇక, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఎంపికైన దగ్గరి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఏర్పడిందని చాహల్ అన్నాడు.

కోహ్లీ చాలా గ్రేట్

కోహ్లీ చాలా గ్రేట్

"కోహ్లీ చాలా గ్రేట్. మైదానంలో బయట కూడా నాతో ఎంతో హుందాగా వ్యవహారిస్తాడు. నా ఎదుగుదలలో కోహ్లీ పాత్ర ఎంతో కీలకం" అని అన్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడకుండా ఉంటే టీమిండియాతో తనకు ఉన్న కెమిస్ట్రీ అసంపూర్తిగా ఉంటుందని చాహల్ అన్నాడు.

Story first published: Wednesday, November 14, 2018, 18:46 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X