Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ వంటి పేద దేశంలో ఎఫ్1 రేసులా?: హామిల్టన్ సంచలనం

India Was Such A Poor Place: Lewis Hamilton Questions New F1 Races

హైదరాబాద్: ఫార్ములా వన్ రేసర్, బ్రిటన్‌కు చెందిన లూయిస్ హామిల్టన్‌ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఈ 33 ఏళ్ల రేసర్‌ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో భారత్‌లో ఫార్ములా వన్ రేస్ నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత్ లాంటి పేద దేశాల్లో భారీగా ఖర్చు చేసి

భారత్ లాంటి పేద దేశాల్లో భారీగా ఖర్చు చేసి

అంతేకాదు యూరప్, అమెరికా దేశాల్లోనే ఎక్కువగా రేస్‌లు నిర్వహిస్తేనే మంచిదని, భారత్ లాంటి పేద దేశాల్లో భారీగా ఖర్చు చేసి రేస్‌లు నిర్వహించడం దండగ అని అన్నాడు. కాగా, వియత్నాంలో తొలిసారిగా గ్రాండ్ ప్రీ రేస్‌లు నిర్వహించడానికి ఇటీవలే ఫార్ములా వన్ నిర్వాహక సంఘం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

లూయిస్ హామిల్టన్ మాట్లాడుతూ

లూయిస్ హామిల్టన్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో లూయిస్ హామిల్టన్ మాట్లాడుతూ "వియత్నాం దేశంలో తాను పర్యటించానని, ఆ దేశం చాలా అందంగా ఉంది. పేద దేశమైన భారత్‌లో ఎంతో ఖర్చు పెట్టి అందమైన రేస్ ట్రాక్ నిర్మించారు. భారత్‌ గ్రాండ్ ప్రీకి వెళ్లినప్పుడు చాలా అయోమయంగా అనిపించిది. ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలతో పాటు కొన్ని అమెరికా దేశాల్లో గ్రాండ్ ప్రీ రేస్‌లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది" అని అన్నాడు.

2011లో భారత్‌లో ఫార్ములావన్‌ రేస్‌

2011లో భారత్‌లో ఫార్ములావన్‌ రేస్‌

2011లో ఫార్ములావన్‌ రేస్‌కు భారత్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. మూడు వేల కోట్లు ఖర్చు చేసి ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా రేస్ ట్రాక్‌ను నిర్మించారు. ఆ తర్వాత 2012, 2013లోనూ బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదికగా రేస్‌లు జరిగాయి.

మిగతా ఆసియా దేశాలు పోటీపడటంతో

మిగతా ఆసియా దేశాలు పోటీపడటంతో

అయితే, ఎఫ్1 రేస్‌లు నిర్వహించే మిగతా ఆసియా దేశాలు పోటీపడటంతో భారత్‌లో ఫార్ములావన్‌ రేస్‌లు నిర్వహించడం లేదు. దీంతో వేల కోట్లు ఖర్చు చేసి గ్రాండ్ ప్రీ కోర్ట్ నిర్మిస్తే, భారత్‌లో ఫార్ములా వన్ రేస్‌లు నిర్వహించడం లేదని విమర్శలు వచ్చాయి. కాగా, 2020 నుంచి వియత్నాంలో ఎఫ్1 రేస్‌‌లు జరగనున్నాయి.

Story first published: Wednesday, November 14, 2018, 18:21 [IST]
Other articles published on Nov 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+