ధోనీ ఆశించాడు.. కాబట్టే టీ20 నుంచి తప్పుకున్నాడు: కోహ్లీ


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌లో లేడంటూ టీ20 ఫార్మాట్ నుంచి తప్పించారు. ఆస్ట్రేలియాతో భారత్ చేయనున్న పర్యటనలోనూ అతని పేరును ఖరారు చేయలేదు. దీనికర్థం ధోనీ ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కూడా దూరం కాబోతున్నాడనే. ఇది సగటు అభిమాని ప్రశ్న. కొద్ది రోజులుగా టీమిండియా గురించి క్రికెట్ అభిమానులను వెంటాడుతున్న సందేహం.

నోరు విప్పిన కెప్టెన్ కోహ్లి
దీనిపై టీ20ల్లో వేటు వేయడం గురించి తొలిసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నోరు విప్పాడు. వెస్టిండీస్‌తో తిరువనంతపురం వేదికగా ముగిసిన ఆఖరి వన్డే(ఐదో వన్డే).. అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సమావేశంలో కొంతమంది విలేకర్లు టీ20ల్లో ధోనీపై వేటు వేయడం గురించి అడిగిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానమిచ్చాడు.
ఐదో భారత క్రికెటర్: హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్

ఆశించాడు కాబట్టే ఒప్పుకున్నాడు
‘వెస్టిండీస్‌తో టీ20 జట్టు ఎంపికకి ముందే మాజీ కెప్టెన్ ధోనీతో సెలక్టర్లు వ్యక్తిగతంగా మాట్లాడారు. దానికి సమ్మతించిన ధోనీ రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లకి ఎదిగే అవకాశం ఇవ్వాలని ఆశించాడు. కాబట్టే తప్పుకునేందుకు ఒప్పుకున్నాడు. నేను కెప్టెన్‌గా.. చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నా.. మీరంతా అనుకుంటున్నట్లు జట్టులో ఏమీ జరగలేదు' అని కోహ్లీ స్పష్టం చేశాడు.

ధోనీ కెరీర్ ముగిసిందంటూ..,గంగూలీ:
టీ20ల్లో ధోనీపై వేటు వేయడంతో ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ధోనీ కెరీర్ ముగిసిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గంగూలీ, దిలీప్ వెంగ్‌సర్కార్ లాంటి కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా సెలక్టర్ల నిర్ణయానికి మద్దతు తెలిపారు.

రిషబ్ పంత్‌ని వికెట్ కీపర్‌గా జట్టులోకి
ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. ధోనీపై వేటు వేసి అతని స్థానంలో రిషబ్ పంత్‌ని వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా
దీంతో.. ఐదో వన్డేల ఈ సిరీస్‌ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకుంది. వైజాగ్‌లో జరిగిన మూడో వన్డేను టైగా ముగించుకున్నాయి. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ క్రమంలో తొలి టీ20ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications