|
కెప్టెన్‌గా కోహ్లీకి 50వ వన్డే
ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 50 వన్డే. 50 వన్డేల్లో కెప్టెన్‌గా టీమిండియాకు నాయకత్వం వహించిన ఏడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకూ ధోనీ, అజహర్, గంగూలీ, ద్రావిడ్, కపిల్, సచిన్ టెండుల్కర్ మాత్రమే 50కి పైగా వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు.
|
38 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా
కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకూ 49 వన్డేలు ఆడగా.. 38 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్‌లతో సమానంగా కోహ్లీ విజయాలు సాధించడం విశేషం. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్... అలెక్స్ హేల్స్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
|
రెండు వరల్డ్ రికార్డులను నమోదు చేసిన ఇంగ్లాండ్
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోనే ఇంగ్లాండ్ రెండు వరల్డ్ రికార్డు స్కోర్‌లు (441, 481) నమోదు చేసింది. ఇప్పటికే టి20సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్టు కోహ్లీ పేర్కొన్నాడు. టాస్ గెలవడం మంచిదైందని అన్నాడు.
|
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లదే కీలకపాత్ర
టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మణికట్టు స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నట్టు చెప్పాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ తొలుత బ్యాటింగ్ చేయడం మంచి అవకాశమని, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.