వారం రోజుల్లోనే మరో కంపెనీకి అంబాసిడర్‌గా విరాట్

Posted By:
Virat Kohli, Indian cricket captain, roped in by Uber as brand ambassador

హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రముఖ సంస్థకు ప్రచారకర్తగా నియమితుడయ్యాడు. ల్యూమినస్ బ్యాటరీ కంపెనీ లిమిటెడ్‌కు వారం రోజుల క్రితమే అంబాసిడర్‌గా ఎన్నికైన కోహ్లీ... మరో ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్‌గా నేను చాలా ప్రదేశాల్లో పర్యటించాను. ఉబెర్‌లో బుకింగ్ చేసుకోవడంలో మంచి అనుభూతి ఉందని, వ్యక్తిగతంగా చాలా ఎంజాయ్ చేశాను. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేలా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, లక్షలాది మందికి ఆర్థిక అవకాశాలు కల్పించడం గొప్ప విషయం. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలకు సేవలందిస్తున్న కంపెనీతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు.

ఇప్పటి పలు అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రికెట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. శ్రీలంకలో జరుగుతున్న టీ20 ట్రైసిరీస్‌కు కోహ్లీ స్థానంలో సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో స్వతంత్ర్య బ్రాండుగా ఎదగాలనే కాంక్షతో లూమినస్ పవర్ టెక్నాలజీస్ అనే బ్యాటరీ కంపెనీ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంది. దాదాపు కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలంటే ప్రస్తుతం రూ. 242 కోట్ల వరకు చెల్లించాల్సిందే. ప్రపంచంలోని టాప్ 10 అంబాసిడర్లలో టాప్ చాలా మెరుగైన స్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్ స్టార్ ప్రపంచంలోని ఐదో స్థానంలో ఉన్నాడు. అతని ధర కోహ్లీ కంటే తక్కువే.

ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న వారి జాబితాలో ధోనీతో పాటుగా కోహ్లీ కూడా చేరిపోయాడు. 2014‌లో 200 లక్షల డాలర్లు వరకు తీసుకుంటున్న సమయంలోనే కోహ్లీ ఫోర్బ్స్ జాబితాలో ఐదో స్థానం సంపాదించుకున్నాడు. కానీ, ధోనీ బ్రాండ్ వాల్యూ మాత్రం 2015 నుంచి 2016కి వంద లక్షల డాలర్ల వరకు పడిపోయింది.

Story first published: Friday, March 9, 2018, 18:58 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి