ఛీ.. ఛీ.. ఇదేం బుద్ధి? మహిళల ప్రైవేట్ వీడియోలు తీస్తూ దొరికిపోయిన స్టార్ క్రికెటర్లు!
శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. తాము బస చేసిన హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణలపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన కొలంబోలోని నరహేన్‌పిటలో ఉన్న ఓ హోటల్‌లో చోటుచేసుకుంది. అక్కడ బస చేస్తున్న యువ క్రికెటర్లను పోలీసులు ఈ వారం మొదట్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.
బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తాము బాత్రూమ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్‌లతో తమ వీడియోలు తీశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు విచారించిన నరహేన్‌పిట పోలీసులు, యువ క్రికెటర్లు అటువంటి వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయం శ్రీలంక క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు ఆటగాళ్లను అనంతరం అలుత్‌కడే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి వ్యక్తిగత బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో ఆటగాడికి 5 లక్షల శ్రీలంక రూపాయల (సుమారు 1,564 అమెరికన్ డాలర్లు) వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ లభించింది. ఈ కేసు తదుపరి విచారణ మే 25వ తేదీకి వాయిదా పడింది.
ప్రస్తుతానికి, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆటగాళ్ల పేర్లను అధికారులు వెల్లడించలేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. తీసిన వీడియోలను ఆన్‌లైన్‌లో లేదా ఇతర మాధ్యమాల ద్వారా షేర్ చేశారా అనే కోణంలో నరహేన్‌పిట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం క్రికెట్ ప్రపంచంలో ఇంకా చర్చనీయాంశంగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications