Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్ అవుట్.. రీప్లేస్

ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. గెలిచిన పాపాన పోవట్లేదీ జట్టు. అన్నీ ఓటములే. ఒకదాని వెంట ఒకటి వరుస కట్టాయి వైఫల్యాలన్నీ కూడా. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడగా.. గెలిచింది రెండే. 240కి పైగా పరుగులను కూడా కాపాడుకోలేకపోయింది ముంబై.. హైదరాబాద్ పై. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కోల్ కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ స్థాయికి దిగజారింది.

ఈ పరిస్థితుల్లో మరో బిగ్ షాక్ తగిలింది ముంబై ఇండియన్స్ కు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ గాయపడ్డాడు. అతని భుజానికి తీవ్ర గాయమైంది. కనీసం నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. తాజాగా అతని భుజానికి నిర్వహించిన స్కానింగ్ వల్ల గాయం తీవ్రత బయటపడింది. శాంట్నర్ ఎడమ భుజానికి గ్రేడ్ మూడు ఏసీఎల్ గాయం అయినట్లు నిర్ధారణ అయింది. 34 ఏళ్ల ఈ స్పిన్ ఆల్-రౌండర్ కివీస్ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడు కావడం గమనార్హం.

Mitchell Santner Mumbai Indians Player Out for At Least a Month Following Shoulder ACL Injury

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ శాంట్నర్ గాయపడ్డాడు. దీంతో ముంబై ఫ్రాంచైజీ అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకోవలసి వచ్చింది. శాంట్నర్ ఈ వారం ప్రారంభంలో న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లనున్నాడు. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకోనున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ రిహాబిలిటేషన్ ఉండబోతున్నాడు.

ఐపీఎల్ అనంతరం న్యూజిలాండ్ ఈ నెల 27న ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత జూన్ 4 నుండి లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో కీలకమైన మూడు టెస్టుల ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ ప్రారంభం కానుంది. శాంట్నర్ ఐర్లాండ్ టెస్టుతో పాటు లార్డ్స్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడు. మిగిలిన సిరీస్‌లో అతను ఆడతాడా లేదా అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.

ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్‌తో పాటు గత ఏడాది పాకిస్థాన్, దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు చేరుకోవడంలో శాంట్నర్ పాత్ర కీలకం. ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం న్యూజిలాండ్ వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో భారత్‌తో స్వదేశంలో ప్రతిష్టాత్మకమైన మూడు ఫార్మాట్ల సిరీస్ ఉంటుంది.

Story first published: Friday, May 1, 2026, 14:44 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+