For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా.. 264 పరుగులకు 2 వికెట్లే

ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. టీ20 ప్రపంచ కప్‌లో అదరగొట్టినప్పటికీ.. ఐపీఎల్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అతని వైఫల్యం వల్లే ముంబై ఇండియన్స్ వరుస మ్యాచ్ లను ఓడిపోతోందనడంలో సందేహాలు సైతం అక్కర్లేదు. ప్రపంచంలోనే ది బెస్ట్ పేస్ బౌలర్ గా, మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు పొందిన బుమ్రా ఈ సీజన్ లో ఏ మాత్రం కూడా తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. కుర్ర బ్యాటర్లు కూడా అతని బౌలింగ్ ను చీల్చి చెండాడుతున్నారు.

ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 30 ఓవర్లు సంధించిన బుమ్రా రెండు వికెట్లే తీశాడు. ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా తొలి అయిదు మ్యాచ్‌లలో పొదుపైన బౌలింగ్ చేసినా వికెట్లు పడగొట్టలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్‌పై 1/15 గణాంకాలతో ఈ సీజన్ ను ఆరంభించాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై 1/31తో ఒక వికెట్ తీశాడు. అక్కడే ఆగిపోయాడు.

Jasprit Bumrah MI Speedster conceding 264 runs in 30 overs and taking 2 wickets IPL 2026 so far

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తొలిసారి 50+ పరుగులు ఇచ్చాడు. బుమ్రా 0/54 ప్రదర్శన అతని టీ20 కెరీర్‌లో నాలుగవ అత్యంత ఖరీదైనది. ఐపీఎల్‌లో గతంలో రెండుసార్లు మాత్రమే 54 పరుగుల కంటే ఎక్కువ ఇచ్చాడు. 2021లో ఢిల్లీలో చెన్నై సూపర్ కింగ్స్ పై 1/56, 2015లో ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ పై 1/55 ఇచ్చిన చరిత్ర అతనికి ఉండేది. ఇప్పడది చెరిగిపోయింది.

ఈ ఐపీఎల్ లో, ఎనిమిది మ్యాచ్‌లలో బుమ్రా రెండు వికెట్లు తీసి, 30 ఓవర్లలో 264 పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్ సగటు 132. ఈఎస్పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో డేటా ప్రకారం ఐపీఎల్ ఎడిషన్‌లో కనీసం 25 ఓవర్లు వేసిన బౌలర్లలో ఇది వరస్ట్ బౌలింగ్ యావరేజ్. కీరన్ పొలార్డ్ 2014లో సగటు 131+. కు ఇది సమానం. సీజన్ ఆరంభం వరకూ బౌలింగ్‌లో మంచి ఎకానమీ రేటు ఉన్నా ఇప్పుడది దిగజారుతోంది. వికెట్లు తీయటంలో అతను తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అతని సగటు వేగం సైతం 132.1 కిలోమీటర్లకు పడిపోయింది.

Story first published: Friday, May 1, 2026, 11:54 [IST]
Other articles published on May 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+