అందుకే కృనాల్ పాండ్యాతో బౌలింగ్ చేయించలేదు
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. గురువారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39) మెరుపు ఇన్నింగ్స్‌లతో జీటీ 155 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసినా లాభం లేకపోయింది. జేసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఈ మ్యాచ్ పై పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ విఫలం కావడంపై స్పందించాడు. పవర్‌ప్లేలో ధారళంగా పరుగులు ఇవ్వడాన్ని సమర్థించాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్ వేయకపోవడానికీ గల కారణాలను వివరించాడు. హేజిల్‌వుడ్ కు ఏదీ కలిసిరాలేదని పేర్కొన్నాడు. ఓ భారీ టోర్నమెంట్‌లో ఇటువంటివి సర్వసాధారణమని వ్యాఖ్యానించాడు. కృనాల్ పాండ్యాను బౌలింగ్‌కు దించకుండా, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మలకు అవకాశమివ్వడం వ్యూహాత్మక నిర్ణయమని భువనేశ్వర్ తెలిపాడు.

పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉందని, లో స్కోర్ కావడం వల్ల వీలైనంత త్వరగా వికెట్లు తీయాలనే ఉద్దేశంతోనే కృనాల్ పాండ్యాకు బౌలింగ్ ఇవ్వకూడదని నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నాడు. లోస్కోర్ కావడం వల్ల వికెట్లు తీయడం ద్వారా గెలవగలమనే నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశాడు. రజత్ పటిదార్ క్యాచ్ వివాదంపై స్పందించాడు. అంపైర్లు మరింత నిశితంగా పరిశీలించి ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ వెంకటేష్ అయ్యర్‌తో కలిసి 170 పరుగుల లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ అతను త్వరగా అవుట్ అయ్యాడని చెప్పాడు.
తన ప్రదర్శన గురించీ మాట్లాడాడు భువనేశ్వర్ కుమార్. వ్యక్తిగత ప్రశంసల కంటే జట్టు విజయానికే ప్రాధాన్యతనిస్తానని అన్నాడు. పర్పుల్ క్యాప్ లభించడం సంతోషంగా ఉందని, జట్టు కోసం మరింత సాధించాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. పర్పుల్ క్యాప్ కోసం ఆశపడే వాడిని కాదని వ్యాఖ్యానించాడు. జట్టు విజయంలో భాగంగా వచ్చే వ్యక్తిగత గుర్తింపే తనకు సంతోషాన్ని కలిగిస్తుందని మేనేజ్‌మెంట్ తనకు సహకరిస్తోందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications