న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 19 వేల పరుగుల క్లబ్‌లో కోహ్లీ

Virat Kohli beats Sachin Tendulkar to become the fastest to reach 19000 international runs

సిడ్నీ: విరాట్ టెస్టుల్లో అంతకుముందున్న దూకుడు చూపించకపోయినా.. ఏడాదికి శుభారంభాన్నే నమోదు చేశాడు. 19000 అంతర్జాతీయ పరుగులను సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కేవలం 23 పరుగులకే అవుట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికే కేఎల్ రాహుల్ వికెట్ తీసిన హేజిల్ వుడ్ చేతికే చిక్కాడు. దీంతో కోహ్లీ పేరిట మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ 19వేల పరుగులు చేసిన జాబితాలో చేరిపోయాడు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో పూర్తి చేసి

ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు టెండూల్కర్ 432 ఇన్నింగ్స్‌ల కంటే తక్కువగా కేవలం 399 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేశాడు. గడిచిన సంవత్సరం 2018లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసిన కోహ్లీ.. ఖాతాలో ఇది కూడా చేరిపోయింది. దీంతో సచిన్ పేరిట ఉన్న మరిన్ని రికార్డులను బ్రేక్ చేయగలడంటూ విరాట్‌పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 కోహ్లీ కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో

కోహ్లీ కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో

2018వ సంవత్సరంలోనే కోహ్లీ 2735 అంతర్జాతీయ పరుగులు, 11 సెంచరీలు పూర్తి చేశాడు. కోహ్లీ కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇదే టాప్ స్కోర్. 13 టెస్టుల్లో 1322 పరుగులు పూర్తి చేసి 55 యావరేజితో కొనసాగాడు. దాంతో పాటు ఫార్మాట్‌లోనే అత్యధిక స్కోరు బాదిన బ్యాట్స్‌మన్‌గా వరల్డ్ నెం.1లో నిలిచాడు. ఇదిలా ఉంచితే పరిమితి ఓవర్ల ఫార్మాట్‌లోనూ 2018లో 14 మ్యాచ్‌లు ఆడి 1202 పరుగులు చేశాడు. ఇందులో బ్రాడ్‌మన్ 133 యావరేజ్‌కు సమం చేస్తూ మొత్తం 6 సెంచరీలు సాధించాడు.

'పార్టనర్ మారాడు.. పిచ్ మారింది.. రాహుల్ మారడా?'

సిడ్నీ వేదికగా ఆరంభమైన నాలుగో టెస్టు

సిడ్నీ వేదికగా ఆరంభమైన నాలుగో టెస్టు

ఇలా 19వేల పరుగులు చేసిన క్లబ్‌లో టాప్5గా కోహ్లీ(399), సచిన్ (432)తో పాటు బ్రియాన్ లారా(433), రిక్కీ పాంటింగ్(444, జాక్వెస్ కల్లిస్(458)లు ఉన్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తలపడుతున్న భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. నిర్ణయాత్మక ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

1
43626
Story first published: Thursday, January 3, 2019, 12:16 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X