న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నువ్వెన్ని చేసినా సరే.. మగాడే ఎత్తుగా ఉంటాడు'

Virat Kohli Stands On A Stool Beside A Female Tennis Star
Virat Kohli at the receiving end for trying to match the height of Tennis star Karman Kaur Thandi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు. ప్రమోషనల్ ఈవెంట్లలోనూ తానే ముందుంటాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్రచారాల్లో పాల్గొంటాడు. యావత్ దేశం మొత్తంలో మిస్టర్ ఫిట్ క్రికెటర్‌గా పేరొందిన విరాట్ పిచ్‌లో ఉంటేనే సీరియస్. బయట సమయాన్ని చాలా ఉల్లాసంగా సరదాగా గడిపేస్తాడు. ఇందులో భాగంగానే కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు వహిస్తోన్న టిస్సాట్ వాచ్ కంపెనీ కార్యక్రమానికి విరాట్ హాజరైయ్యాడు.

ఎత్తు సమానమయ్యేందుకు అక్కడి మెట్లను

టిస్సాట్ కంపెనీ బాంద్రాలోని ప్రముఖ 5స్టార్ రెస్టారెంట్‌లో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చిన ప్రత్యేక అతిథులకు వాచ్‌లను బహుకరించాడు. ఈ క్రమంలోనే ప్రముఖ టెన్నిస్ స్టార్ అయిన కర్మాన్ కౌర్ తండీతో ఫొటోకి ఫోజిచ్చాడు. ఆవిడ దాదాపు కోహ్లీ కంటే హైట్ ఉండటంతో ఎత్తు సమానం అయ్యేందుకు అక్కడ ఉన్న మెట్లను వాడాడు. చాలా సరదాగా కేవలం ఫొటో కోసమే చేసిన ఈ పనికి నెటిజన్లు విపరీతంగా స్పందించారు.

మరికొందరు మగాడిని అనే భావనతో ట్వీట్లు

సత్నం సింగ్, కర్మాన్ కౌర్ తండీ, ఆదిల్ బేడీ, శివానీ కటారియా, సాచికా కుమార్ ఇంగాలె, జెహాన్ దారువాలా, పింకీ రాణీ, మనోజ్ కుమార్‌లు అతిథులుగా ఇందులో పాల్గొన్నారు. కోహ్లీలో లోపం వెతకడానికి ప్రయత్నించే విమర్శకులు ఎత్తు లోపాన్ని ఎత్తి చూపుతూ.. సంబరపడిపోతున్నారు. మరికొందరు మగాడిని అనే భావనతో ట్వీట్లు పెడుతున్నారు.

నువ్వేమైనా చేసుకో.. కానీ, ఆడాళ్లు మగాళ్ల కంటే

'నువ్వేమైనా చేసుకో.. కానీ, ఆడాళ్లు మగాళ్ల కంటే ఎత్తు ఎప్పుడూ కాలేరు.' ఇంకొకరేమో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. 29ఏళ్ల కోహ్లీనేమో 175 సెం.మీలు. 20 ఏళ్ల కర్మాన్ కౌర్ తండీనేమో 183సెం.మీలు అలాంటిది ఈ పిక్చర్‌లో కోహ్లీనే ఎత్తుగా ఎలా కనిపిస్తున్నాడు. టిస్సాట్‌కి ప్రచారానికి ఇదెలా ఉపయోగపడుతుంది.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో కనిపిస్తోన్న మరో టెన్నిస్ క్రీడాకారిణి కమ్రాన్ కౌర తండీ.. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా రాణిస్తోన్న భావి క్రీడాకారిణి మాత్రమే.

వారికి లేని ఆలోచన మీకెందుకు

కర్మాన్ కౌర్‌తో పాటుగా పాల్గొన్న క్రీడాకారులంతా కోహ్లీ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారేనట. ఈ విషయంపై కూడా స్పందించిన ఓ నెటిజన్.. 'ఇలా ఎత్తు గురించి ఆలోచిస్తే కోహ్లీ.. కమ్రాన్‌లలో ఎవరైనా బాధపడాలి. వారికి లేని ఆలోచన మీకెందుకు కానీ, ఈ విషయంలో ఇలా ఫొటో షూట్ ఏర్పాటు చేసిన ఆ టిస్సాట్ నిర్వహక సంఘానికి తెలియాలి' అంటూ కోహ్లీపై సానుభూతి కురిపించాడు.

Story first published: Tuesday, October 9, 2018, 15:18 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X