|
రుతురాజ్ మినహా..
రుతురాజ్‌కు తోడుగా ఏ ఒక్కరు కూడా రాణించలేదు. దాంతో మహారాష్ట్ర సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. సౌరాష్ట్ర బౌలర్లలో చిరాగ్ జానీ మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనాద్కత్, ప్రేరక్ మన్కండ్, పార్థ్ భుట్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసి విజయాన్నందుకుంది. షెల్డన్ జాక్సన్‌కు తోడుగా హర్విక్ దేశాయ్(50), చిరాగ్ జానీ(30 నాటౌట్) రాణించారు. మహరాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌదరి, విక్కీ రెండేసి వికెట్లు తీయగా.. సత్యజీత్ బాచ్‌లావ్ ఓ వికెట్ పడగొట్టాడు. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన షెల్డన్ జాక్సన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లభించింది.
|
4 సెంచరీలు చేసినా..
ఈ టోర్నీలో రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో 660 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోర్ 220 నాటౌట్. రుతురాజ్ సూపర్ బ్యాటింగ్‌తో తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేరిన మహారాష్ట్ర టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక రుతురాజ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని కామెంట్ చేస్తున్నారు.
|
15 ఏళ్ల తర్వాత
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ అటు కెప్టెన్‌గా.. ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. 19 వికెట్లతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. జట్టుకు రెండోసారి విజయ్ హజారే ట్రోఫీ అందించాడు. ఈ ప్రదర్శనతో మళ్లీ అతను ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ముంబై ఇండియన్స్ తరఫున గత సీజన్‌లో దారుణంగా విఫలమైన ఉనాద్కత్‌ను ఆ జట్టు వదిలేసింది. దాంతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.