న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Vijay Hazare Trophy: పృథ్వీ షా మెరుపులు.. ఆదిత్య తారే సెంచరీ! విజయ్‌ హజారే ట్రోఫీ చాంపియన్ ముంబై!

Vijay Hazare Trophy 2021: Aditya Tare, Prithvi Shaw shine Mumbai Beat Uttar Pradesh in final

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని ముంబై జట్టు నాలుగోసారి కైవసం చేసుకుంది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా నాయకత్వంలోని ముంబై జట్టు ఆదివారం అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూపీ నిర్ధేశించిన 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పృథ్వీ షా (73: 39 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. సీనియర్ ఆటగాడు ఆదిత్య తారే (118 నాటౌట్:‌ 107 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కాడు.

మాధవ్‌ కౌశిక్‌ శతకం:

మాధవ్‌ కౌశిక్‌ శతకం:

ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌.. ఓపెనర్‌ మాధవ్‌ కౌశిక్‌ (156 బంతుల్లో 158 నాటౌట్‌; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్‌ శతకానికి మరో ఓపెనర్‌ సమర్థ్‌ సింగ్‌ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అక్షదీప్‌నాథ్‌ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకాలు చేయడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్‌ దయాల్‌, శివమ్‌ మావి, శివమ్‌ శర్మ, సమీర్‌ చౌదరీలు తలో వికెట్‌ తీశారు.

 తారే సెంచరీ:

తారే సెంచరీ:

అనంతరం లక్ష్య ఛేదనలో పృథ్వీ షా (73), ఆదిత్య తారే (118 నాటౌట్‌) చెలరేగడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (29‌), శివమ్‌ దూబే (42), శామ్స్‌ ములానీ (36) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో యూపీ బౌలర్లు విఫలమయ్యారు. తనుశ్‌ కోటియన్‌ 2, ప్రశాంత్‌ సోలంకీ ఒక వికెట్‌ సాధించారు.

ట్రోఫీలో అత్యధిక స్కోర్‌:

ట్రోఫీలో అత్యధిక స్కోర్‌:

సీజన్‌లో పృథ్వీ షా బ్యాటింగ్‌ హైలెట్‌గా నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు షా ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఈ క్రమంలోనే షా దేశవాళి క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో ఒకే సీజన్‌లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఒకే సీజన్‌లో షా 827 పరుగుల అత్యధిక స్కోర్‌ సాధించాడు. 2018లో కర్ణాటక తరఫున మయాంక్‌ అగర్వాల్‌ సాధించిన 723 పరుగులే ఇదివరకు ఈ ట్రోఫీలో అత్యధిక స్కోర్‌గా నమోదైంది. ముంబై కెప్టెన్‌ పృథ్వీ షా (825), కర్ణాటక బ్యాట్స్‌మన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్ ‌(725).

India vs South Africa: మిథాలీ రాజ్‌ మరో ప్రపంచ రికార్డు!!

Story first published: Sunday, March 14, 2021, 18:32 [IST]
Other articles published on Mar 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X