న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్చ్.. మంధాన మెరిసినా ఓటమి తప్పలేదు

 Tri-Nation Womens T20I Series: Natalie Sciver guides England to 4-wicket win over India

మెల్‌బోర్న్: మహిళల ట్రై నేషన్ టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా మరో ఓటమి చూసింది. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 4 వికెట్లతో ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 123 పరుగులు చేసింది.

ఓపెనర్ స్మృతి మంధాన (40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) మినహా మిగతా బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ (23), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14) విఫలమవ్వగా.. యువ సంచలనం షెఫాలీ వర్మ (8) , వేద కృష్ణ మూర్తి(2), తానియా బాటియా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఇక దీప్తి శర్మ(9 నాటౌట్ ), హైదరబాద్ గర్ల్ అరుందతీ రెడ్డి (7 నాటౌట్ ) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

శ్రీశాంత్‌కు భజ్జీ బర్త్‌డే విషెస్.. ఆ చెంప దెబ్బ గిఫ్టా అంటున్న అభిమానులుశ్రీశాంత్‌కు భజ్జీ బర్త్‌డే విషెస్.. ఆ చెంప దెబ్బ గిఫ్టా అంటున్న అభిమానులు

ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్‌సోల్ (3/31) మూడు వికెట్లతో భారత మహిళల పతనాన్ని శాసించగా.. కేథరిన్ బ్రంట్ రెండు వికెట్లు తీసింది. అనంతరం 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసి 7 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. ఆ జట్టులో నటాలి సీవర్ (50) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో ఫ్రాన్ విల్సన్ (20 నాటౌట్) మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ (3/23) మూడు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది.

టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఈ ముక్కోణపు టోర్నీలో హర్మన్ సేన వైఫల్యం ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. ఆస్ట్రేలియాతో ఓడింది. తాజాగా ఇంగ్లండ్ చేతిలో మరో ఓటమిచవిచూసింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను శనివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.

సంక్షిప్త స్కోర్లు:
భారత్ : 123/6( మంధాన 45, అన్య శ్రుబ్‌సోల్ 3/31)
ఇంగ్లండ్ : 124/6(నటాలి సీవర్ 50, రాజేశ్వరి గైక్వాడ్ 3/23)

Story first published: Friday, February 7, 2020, 15:00 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X