న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మూడు రికార్డులు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు సాధ్యం కాలేదు!

Three Records Sachin Tendulkar couldn’t break in his international career

హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆట గురించి, వ్యక్తిత్వం గురించి, టీమిండియాకు అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. మైదానంలో నెలకొల్పిన రికార్డులు.. అతని వ్యవహార శైలి చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఔట్ కాదని తెలిసినా.. అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి వాగ్వాదం చేయకుండా మైదానం వీడిన ఏకైక క్రికెటర్ సచిన్. ఇండియాలో క్రికెట్ ఒక మతమైతే ఆ మతానికి సర్వంతర్యామి సచిన్.. క్రికెట్ ఒక సామ్రాజ్యమైతే దానికి చక్రవర్తి సచిన్.. క్రికెట్ ఒక సంపద అయితే దానికి సర్వాధికారి సచిన్.. 100 సెంచరీలు.. వన్డేల్లో డబుల్ సెంచరీ వంటి అసాధ్యం కానీ ఘనతలను సుసాధ్యం చేసింది సచిన్.. అలాంటి సచిన్ తన 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు రికార్డులను అందుకోలేకపోయాడు. అవి ఏంటో తెలుసుకుందాం.

 టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ లేదు..

టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ లేదు..

లేత లేత పాల బుగ్గలతో 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్.. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో రెండు ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు బాదాడు. టెస్ట్‌ల్లో 51 సెంచరీలు కొట్టాడు. తన వరుస సెంచరీలతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. ఆరు డబుల్ సెంచరీలతో మెరిసాడు. కానీ ఒక్క ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 248. ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేసినా.. వాటిని ట్రిపుల్ సెంచరీలుగా మార్చలేకపోయాడు. కానీ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం పాక్, సౌతాఫ్రికాలపై రెండేసి సార్లు ట్రిపుల్ సెంచరీలు బాదాడు. ఓవరాల్‌గా నాలుగు ట్రిపుల్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో మెరిసాడు. మరే భారత బ్యాటర్‌ కూడా ఈ ఘనతను అందుకోలేదు. వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం 281 పరుగులతో వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఎక్కువ ప్రపంచకప్‌లు ఆడినా ..

ఎక్కువ ప్రపంచకప్‌లు ఆడినా ..

చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్.. కెరీర్‌లో మొత్తం 6 ప్రపంచకప్‌లు ఆడాడు. విజేతగా నిలిచింది మాత్రం 2011 ప్రపంచకప్‌లోనే. 2003లో ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలయ్యారు. 1992, 1996, 1999, 2007, 2011 ప్రపంచకప్‌లు ఆడిన సచిన్.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా( 2278) రికార్డుకెక్కాడు. అత్యధిక ప్రపంచకప్ సెంచరీలు, హాఫ్ సెంచరీల రికార్డు కూడా సచిన్ పేరే ఉంది. సచిన్ తర్వాత జావెద్ మియాందాద్ 6 ప్రపంచకప్‌లు ఆడాడు. అయితే సచిన్ అత్యధిక ప్రపంచకప్‌లు ఆడినా.. ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఘనతను మాత్రం అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా చెందిన రికీపాంటింగ్ మూడు ప్రపంచకప్‌లే ఆడినా మొత్తం 46 మ్యాచ్‌లు ఆడాడు.

టెస్ట్‌ల్లో అత్యధిక బాల్స్ ఆడలేదు..

టెస్ట్‌ల్లో అత్యధిక బాల్స్ ఆడలేదు..

200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎక్కువ బంతులను ఎదుర్కోలేకపోయాడు. అతని సహచరుడు రాహుల్ ద్రవిడ్ 164 టెస్ట్‌ల్లో 31258 బంతులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక బాల్స్ ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. సచిన్ మాత్రం 200 మ్యాచ్‌ల్లో 29437 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. సచిన్ తర్వాత జాక్వస్ కల్లిస్, శివనరైన్ చంద్రపాల్, అల్లాన్ బోర్డర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. సచిన్ తర్వాత ఏడేళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన ద్రవిడ్ ఈ రికార్డు అందుకోవడం గమనార్హం. ద్రవిడ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయేవాడు.టెండూల్కర్ మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడేవాడు. 53.78 సగటుతో 15921 పరుగులు చేశాడు.

Story first published: Thursday, August 4, 2022, 14:43 [IST]
Other articles published on Aug 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X