న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ 312 రన్స్‌తో గెలిస్తేనే! అసలు వన్డేలో ఓ జట్టు గెలిచిన అత్యధిక పరుగుల మార్జిన్ ఎంతో తెలుసా?

The largest ever mens ODI win was by New Zealand against Ireland in 2008. The margin was 290 runs

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో 312 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భారీ పరుగుల మార్జిన్‌తో విజయం సాధిస్తుందా లేదా అని ఆ దేశ అభిమానులు సందిగ్దంలో ఉన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అసలు వన్డే క్రికెట్‌లో ఓ జట్టు గెలిచిన అత్యధిక పరుగుల మార్జిన్ ఏంటో చూస్తే మాత్రం పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌ను 312 ప‌రుగుల తేడాతో ఓడించడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ జట్టు నమోదు చేసిన అత్యధిక పరుగుల విజయం ఎంతో తెలుసా? 290 పరుగులు.

2008లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో

2008లో ఐర్లాండ్‌తో జరిగిన ఓ వన్డేలో న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక మార్జిన్ కావడం విశేషం. శుక్రవారం లార్డ్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ఈ రికార్డుని బద్దలు కొడితేనే సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బంగ్లా రెండు మార్పులు చేసింది. మహ్మదుల్లా జట్టులోకి వచ్చాడు. ' టాస్ గెలవడం చాలా ముఖ్యం. మాకు వేరే ఆప్షన్ లేదు. ఇక భారీ స్కోర్ చేయాలి' అని సర్ఫరాజ్‌ అన్నాడు.

అనూహ్య విజయం సాధించాలి

అనూహ్య విజయం సాధించాలి

ఈ మ్యాచ్ పాక్ జట్టుకు చాలా కీలకం. కుడిచేతి బ్యాట్స్‌మన్‌కు లెగ్ సైడ్, పాయింట్ దిశగా మైదానం చిన్నదిగా ఉండడంతో బౌండరీల మోత మోగే అవకాశం ఉంది. సాంకేతికంగా సెమీ ఫైనల్‌ రేసులో నిలిచిన పాకిస్థాన్‌.. దాన్ని నిజం చేయాలంటే ఈ మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించాలి. విజయం అంటే మామూలు విజయం కాదు.. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉండాలి.

312 పరుగుల తేడాతో గెలిస్తేనే!

312 పరుగుల తేడాతో గెలిస్తేనే!

పాకిస్థాన్ మొదటగా బ్యాటింగ్ చేసి 312 పరుగుల తేడాతో విజయం సాధిస్తే సెమీ ఫైనల్‌ రేసులో ఉంటుంది. లేదంటే సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి.. నాలుగు గెలిచి, మూడు ఓడిపోయింది.

పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం చాలా తక్కువ

పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం చాలా తక్కువ

మరొక మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బంగ్లాపై గెలిచినా.. 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమానంగా ఉంటుంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ ఇప్పటికే కివీస్‌కు +0.175 ఉండడం, పాకిస్థాన్‌కు -0.792గా ఉండడంతో పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం చాలా తక్కువ.

1
43686

{headtohead_cricket_5_10}

Story first published: Friday, July 5, 2019, 15:13 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X