
11 మ్యాచ్‌ల్లో 10 విజయం..
అయితే ఈ మ్యాచ్‌కు ముందు క్రైస్ట్ చర్చ్ రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయి. ఈ వేదికగా టీమిండియా ఇప్పటి వరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. బుధవారం జరిగేదే ఫస్ట్ మ్యాచ్. న్యూజిలాండ్‌కు మాత్రం ఇక్కడ ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
2018లో ఇంగ్లండ్ చేతిలో ఒక మ్యాచ్ మాత్రమే ఓడింది. ఇప్పుడు ఈ రికార్డే గబ్బర్ సేనను భయపెడుతోంది. కివీస్‌కు అచ్చొచ్చిన మైదానంలో గెలవాలంటే స్థాయికి మించి రాణించాల్సిందే. అయితే ఈ ఘనమైన రికార్డును టీమిండియా తిరగరాస్తుందో లేదో చూడాలి.
|
టికెట్లన్నీ సేల్..
ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. క్రైస్ట్ చర్చ్‌కు సమీపంగా భారతీయులు ఎక్కువగా ఉంటారని, దాంతోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. టీ20 సిరీస్‌తో పాటు తొలి వన్డేలకు కూడా ప్రేక్షకాదరణ బాగానే లభించింది. ముఖ్యంగా భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక ఇరు జట్లు ఇప్పటికే ఈ వేదికకు చేరుకున్నాయి. సోమవారం హాఫ్ డే కావడంతో ఆటగాళ్లంతా క్రైస్ట్ చర్చ్ వీధుల్లో చిల్ అయ్యారు. మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేయనున్నారు.

పిచ్ రిపోర్ట్..
క్రైస్ట్ చర్చ్‌లో హాగ్లే ఓవల్ పిచ్ భిన్నంగా ఉంటుంది. అటు బ్యాటర్లు ఇటు బౌలర్లకు సహకరిస్తోంది. ఈ వేదికగా భారీ స్కోర్లు నమోదయ్యాయి. అలాగే బౌలర్లు సత్తా చాటిన ఘటనలు ఉన్నాయి. సీమర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ఎంతటి తోపు బ్యాటర్‌నైనా ఇక్కడ ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా బ్యాటర్లు జాగ్రత్తగా టెక్నికల్‌గా ఆడితే భారీ స్కోర్లు నమోదు చేయవచ్చు. ఈ మైదానంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 262గా ఉంది.

తుది జట్లు(అంచనా)
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్