IND vs SA: ఎక్స్‌ట్రా బ్యాటర్ తీసుకోమని వసీం జాఫర్ ముందే చెప్పాడు! ఎవ్వడూ వినలే!

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు గెలిచిన కోహ్లీసేన.. ఇంగ్లండ్ గడ్డపై ఆ జట్టును ఓడించి 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఆధిక్యం నిలిచింది. ఇదే జోరులో సౌతాఫ్రికా గడ్డపై కూడా విజయం సాధిస్తుందని అంతా భావించారు. పైగా సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో సౌతాఫ్రికా బలహీనంగా మారింది. దాంతో మూడు దశాబ్దాల కలనేరవేరడం ఈసారి పక్కా అని అంతా అనుకున్నారు. వీటికి తోడు తొలి మ్యాచ్‌లో విజయం అంచనాలను రెట్టింపు చేసింది.

కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. చివరకు సిరీస్‌ చేజారింది. అయితే ఇక్కడ సౌతాఫ్రికా గెలిచింది అనేకంటే టీమిండియానే చేజాతులా ఓటమిపాలైందని చెప్పవచ్చు. స్వయంకృతాపరాధంతోనే సునాయసంగా గెలవాల్సిన సిరీస్‌ను చేజార్చుకుంది.

జాఫర్ మాట వినలేదు..

జాఫర్ మాట వినలేదు..

'2018 సౌతాఫ్రికా పర్యటనలో భారత్‌ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే 250కి పైగా పరుగులు చేసింది. అందుకే మూడు టెస్టుల్లోనూ మన బౌలర్లు 20 వికెట్లు తీసినా సిరీస్‌ ఓటమే మిగిలింది. అక్కడ ఆడినప్పుడు అదనపు బ్యాటర్‌ ఉండాల్సిందే''.. ఇదీ సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌. కానీ అతని సూచనలను ఎవ్వడూ పట్టించుకోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అనుసరించిన 4+1 ఫార్మాలా (నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్)ను కొనసాగించి బొక్కా బోర్ల పడింది.

జాఫర్ చెప్పినట్లు చేస్తే..

జాఫర్ చెప్పినట్లు చేస్తే..

జాఫర్ సూచనల ప్రకారం ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ తీసుకొని ఉంటే టీమిండియా పరస్థితి మరోలా ఉండేది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ సామర్థ్యం కలిగిన హనుమ విహారిని అశ్విన్‌కు బదులు తీసుకోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సిరీస్‌లో జడేజా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో 40 ప్లస్ రన్స్ చేసినా ఆ జోరును కొనసాగించలేకపోయాడు. బౌలింగ్‌తోనూ టీమ్‌కు అతను చేసిన మేలు ఏం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో జడేజా బౌలింగ్‌లో విఫలమైనా లోయరార్డర్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పరుగులు జట్టు విజయానికి అవసరమయ్యాయి.

 హనుమ విహారీ తీసుకుంటే..

హనుమ విహారీ తీసుకుంటే..

అశ్విన్ బదులు విహారీని తీసుకుంటే జడేజా పాత్రను పోషించాడు. పైగా భారత్ ఏ పర్యటన ద్వారా అప్పటికే సౌతాఫ్రికా పిచ్ పరిస్థితులను విహారి బాగా అర్థం చేసుకున్నాడు. అయినా అతన్ని టీమ్ పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయింది. కోహ్లీ స్థానంలో రెండో టెస్ట్ ఆడిన విహారి.. కీలక పరుగులు చేశాడు. ముఖ్యంగా మూడో టెస్ట్‌లో విహారిలాంటి బ్యాట్స్‌మన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. రిషభ్ పంత్ సెంచరీ చేసినా మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో టీమిండియా 198 పరుగులకే ఆలౌటైంది. విహారి ఉంటే మరో 50 పరుగులు చేసేది అప్పుడు ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యం ఉండేది.

పుజారా, రహానే వైఫల్యం..

పుజారా, రహానే వైఫల్యం..

ఈ సిరీస్‌లోనూ భారత్‌ కేవలం ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే 270కి పైగా పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టులో ఎంగిడి, రబాడ మినహాయిస్తే మిగతా వాళ్లు అనుభవం లేని బౌలర్లే. కానీ వాళ్లను ఎదుర్కొనేందుకు మన బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జాన్సన్‌ బౌలింగ్‌లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ఇక సీనియర్‌ బ్యాటర్లు పుజారా (3 టెస్టుల్లో 124), రహానే (136)లు రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెరో అర్ధశతకం మినహా దారుణంగా విఫలమయ్యారు. ఎంతో అనుభవమున్న ఈ బ్యాటర్లు.. క్రీజులో ఆత్మవిశ్వాసంతో నిలబడనే లేదు. అసౌకర్యంగా కదులుతూ.. పేలవ షాట్లతో పెవిలియన్‌ చేరారు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోని ఈ జోడీపై ఇక వేటు తప్పకపోవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, January 15, 2022, 15:37 [IST]
Other articles published on Jan 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X