
గత ఏడాదిన్నరగా..
బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేసిన టీమిండియా సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో టీమిండియ్ ఫీల్డింగ్ అందర్నీ కలవరపెడుతోంది. గత ఏడాదిన్నరగా భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో కళ్లు చెదిరే క్యాచ్‌లు, డైవ్‌లతో మైమరిపించే విన్యాసాలు చేసి విజయాలు అందుకున్న టీమిండియా... ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన బంతిని అందుకోలేకపోతోంది.

కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు..
టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్న సమయంలో జట్టు ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. హెడ్ కోచ్ రవి శాస్త్రి పర్యవేక్షణలో తెలుగు తేజం ఆర్ శ్రీధర్.. జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మరో స్థాయికి చేర్చాడు. అతని పనితనంతో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో కుర్రాళ్లతో కూడా టెస్ట్ సిరీస్ గెలిచింది.బ్యాటింగ్ విభాగం ఫెయిల్ అయినా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో దుమ్మురేపింది. కోహ్లీతో పాటు రహానే, పూజారా, ధావన్ వంటి బ్యాటర్లు విఫలమైనా బౌలింగ్, ఫీల్డింగ్‌తో విజయాలందుకుంది. అయితే ఐసీసీ టైటిళ్లు గెలవకపోవడంతో ఈ కాంబినేషన్‌పై బీసీసీఐ వేటు వేసింది.

శ్రీధర్ తప్పుకున్నప్పటి నుంచి..
హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లను తప్పించిన బీసీసీఐ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసింది. ఆ తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రాగా.. ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్ బాధ్యతలు చేపట్టాడు. అయితే ద్రవిడ్ పర్యవేక్షణలోని టీమ్‌మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల వర్క్‌లోడ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టింది తప్పా.. ఫీల్డింగ్, టీమ్ కాంబినేషన్‌ను గాలికొదిలేసింది. దానికి తోడు ఆటగాళ్లకు వరుసగా విశ్రాంతి ఇస్తుండటంతో ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. సిరీస్ సిరీస్‌కు కెప్టెన్‌తో పాటు సగం మంది ఆటగాళ్లు మారుతుండటంతో అతను కూడా ఏం చేయలేకపోతున్నాడు.

ఆటగాళ్లను పదే పదే మార్చడంతోనే..
దాంతోనే టీమిండియా ఫీల్డింగ్ నాసిరకంగా మారింది. పాకిస్థాన్ జట్టు కంటే అధ్వాన్నంగా మారింది. పేలవ ఫీల్డింగ్‌తో ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లోనూ మూల్యం చెల్లించుకుంది. ఆసియాకప్‌లో పాక్, శ్రీలకంతో జరిగిన రెండు సూపర్ 4 మ్యాచుల్లో కలిపి 3 క్యాచులు డ్రాప్ చేసిన భారత ఫీల్డర్లు, మిస్ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లకు అదనపు పరుగులు అందించారు.
తాజాగా బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గ్లోవ్స్‌లో పడిన బంతిని అందుకోలేకపోయాడు. మరో ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ అయితే క్యాచ్‌కు కూడా ప్రయత్నించలేదు. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ మినహా.. భారత ఫీల్డర్లు దారుణంగా విఫలమయ్యారు. తెలుగు తేజం శ్రీధర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా మళ్లీ తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.