న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test Championship ఫైనల్ చేరాలంటే టీమిండియా ఏం చేయాలంటే..?

Team India needs to do over the next 10 months to Qualify for ICC World Test Championship Finals

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 58.33 విజయాల శాతంతో పాటు 77 పాయింట్స్ సాధించిన భారత్.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలంటే అప్‌కమింగ్ సిరీస్‌లన్నీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఆస్ట్రేలియా 75 శాతం విజయాలతో అగ్రస్థానంలో ఉంది. టెస్ట్‌లకు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో ఈ టోర్నీని ఐసీసీ మొదలుపెట్టగా.. ఫస్ట్ ఎడిషన్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఓటమిపాలై తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది.

అన్ని గెలవాల్సిందే..?

అన్ని గెలవాల్సిందే..?

ఈ క్రమంలోనే ఈ సారైనా ఆ టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. కానీ సౌతాఫ్రికా పర్యటనలో ఎదురైన ఓటమి టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసింది. టీమిండియా టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాలంటే అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. ఇంగ్లండ్‌తో జూలై 1న ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్‌తో పాటు బంగ్లాదేశ్ పర్యటనలో విజయం సాధించాలి. అంతేకాకుండా భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియాను మట్టికరిపించాలి.

ఆస్ట్రేలియాను ఓడించాలి..

ఆస్ట్రేలియాను ఓడించాలి..

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ గెలవడం వల్ల భారత్ విజయాల శాతం మెరుగవుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ గడ్డపై జరిగే రెండు టెస్ట్‌లు, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై నాలుగు టెస్ట్‌లు గెలవాలి. కనీసం 3-1తోనైనా ఆస్ట్రేలియాను ఓడిస్తే ఆ జట్టు అగ్రస్తానం చేజారుతుంది. ఇక ఆస్ట్రేలియా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌తో పాటు వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో కూడా ఆసీస్ మూడు టెస్ట్‌లు ఆడనుండగా ఆ జట్టు భవితవ్యం ఈ సిరీస్‌తో తేలనుంది. ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్‌తో కూడా సౌతాఫ్రికా రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు వరుస ఓటములతో తమ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసుకున్నాయి.

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
కచ్చితంగా గెలవాలి..

కచ్చితంగా గెలవాలి..

ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారత్ ఓడటం వల్ల రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు మార్గం సుగుమమవుతోంది. ఏ రిస్క్ లేకుండా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే అప్‌కమింగ్ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ గెలవాలి. గతేడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ముగిసిన అనంతరం కరోనా కలకలం రేగడంతో ఆఖరి మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ మ్యాచే.. జూలై 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆఖరి మ్యాచ్ గెలిచినా.. కనీసం డ్రా చేసుకున్నా భారత్‌దే సిరీస్ అవుతోంది.

Story first published: Wednesday, June 29, 2022, 17:18 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X