న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC2021లో భారత్ ప్రయాణం సాగిందిలా! న్యూజిలాండ్‌పై తప్పితే.. ఎక్కడా తగ్గిందేలే!!

Team India journey in WTC Final, New zealand is only team to beat Virat Kohlis Men

హైదరాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)ను ఐసీసీ 2019లో ప్రవేశపెట్టింది. టీ20 క్రికెట్ రాకతో టెస్టులపై అంతగా ఆసక్తికనబరచని ఫాన్స్.. ఐసీసీ పుణ్యమాని మళ్లీ చూడడం మొదలెట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలనే ఉద్దేశంతో ప్రతి జట్టు టెస్ట్ గెలిచేందుకే ప్రయత్నించాయి. దీంతో కొన్ని మ్యాచులు రసవత్తరంగా సాగాయి. ఇందుకు భారత్-ఆస్ట్రేలియా, భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లే గొప్ప ఉదాహరణ. అదిరిపోయే ఆటతో అన్ని జట్లు అలరించాయి.

అయితే ఫైనల్‌కు మాత్రం భారత్, న్యూజిలాండ్‌ జట్లు దూసుకెళ్లాయి. ముఖ్యంగా భారత్ అద్భుత విజయాలు అందుకుంది. గతేడాది న్యూజిలాండ్‌తో మినహా మిగిలిన అన్ని సిరీస్‌ల్లోనూ విజయాలు సాధించి సగర్వంగా తుది పోరుకు సిద్ధమైంది. ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం.

వెస్టిండీస్‌పై మొదలు

వెస్టిండీస్‌పై మొదలు

డబ్ల్యూటీసీలో భాగంగా భారత్ తన తొలి సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడింది. కరీబియన్‌ గడ్డపై ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో మెగా టోర్నీని కోహ్లీసేన విజయాలతో ఆరంభించింది. తొలి టెస్టులో 318 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. రెండో టెస్టులో 257 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో సాధించిన విజయమే పరుగుల పరంగా విదేశాల్లో భారత్‌కు అతిపెద్ద విజయం. ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్ అజింక్య రహానే (271), తెలుగు ప్లేయర్ హనుమ విహారి (289) బ్యాట్‌తో రాణించారు. ఇషాంత్‌ శర్మ (11), జస్ప్రీత్ బుమ్రా( 13) వికెట్లతో సత్తాచాటారు.

దక్షిణాఫ్రికాపై దంచికొట్టి

దక్షిణాఫ్రికాపై దంచికొట్టి

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ రెండో సిరీస్ ఆడింది. మూడు టెస్టులోనూ భారత్ గెలుపొందింది. అప్పటివరకు టెస్టుల్లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగిన రోహిత్‌ శర్మ.. ఈ సిరీస్‌తోనే ఓపెనర్‌గా మారాడు. తొలి టెస్టులోనే (176, 127) రెండు శతకాలతో అదరగొట్టాడు. మూడో టెస్టులో (212) డబుల్ అందుకున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ తొలి టెస్టు (215)లో ద్విశతకం సాధించగా.. రెండో టెస్టులో (108) సెంచరీ చేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో టెస్టులో (254 నాటౌట్) ద్విశతకంతో చెలరేగాడు. దీంతో వరుసగా 203, ఇన్నింగ్స్‌ 137, ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను భారత్ ఓడించింది.

బంగ్లాను క్లీన్‌స్వీప్‌ చేసి

బంగ్లాను క్లీన్‌స్వీప్‌ చేసి

మూడో సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలోనే భారత్ తలపడింది. రెండు టెస్టుల ఈ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. దాంతో పాయింట్ల పట్టికలో అందరికన్నా ముందు నిలిచింది. తొలి మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వగా.. రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ (243) డబుల్‌ సెంచరీ సాధించాడు. అనంతరం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో విరాట్‌ కోహ్లీ (136) శతకంతో చెలరేగాడు. భారత్‌ ఆడిన తొలి డే/నైట్‌ టెస్టు కూడా ఇదే. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచును దగ్గరుండి పర్యవేక్షించారు.

WTC Final 2021: అత్య‌ధిక పరుగులు, వికెట్లు తీసింది వీరే?.. అడుగు దూరంలో అశ్విన్!!

 భారత్‌కు భారీ షాకిచ్చిన కివీస్

భారత్‌కు భారీ షాకిచ్చిన కివీస్

నాలుగో సిరీస్‌లో న్యూజిలాండ్‌ రూపంలో కోహ్లీసేనకు భారీ షాక్ తగిలింది. 2020 ప్రారంభంలో కోహ్లీసేన కివీస్‌ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ ఘోర ఓటములను ఎదుర్కొంది. దాంతో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తొలిసారి టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కివీస్‌ బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్ బాట పట్టారు. బౌలర్లు కూడా ప్రభావం చూపకపోవడంతో.. కివీస్ సునాయాస విజయాలు అందుకుంది. తొలి మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో కైవసం చేసుకున్న కివీస్.. రెండో టెస్టును ఏడు వికెట్లతో సొంతం చేసుకుంది. మయాంక్‌ (58), షా(54), పుజారా (54), విహారి (55) ఒక్కో ఇన్నింగ్స్‌లలో రాణించారు.

ఆస్ట్రేలియాను అల్లాడించి

ఆస్ట్రేలియాను అల్లాడించి

ఇదో సిరీస్‌లో భాగంగా కంగారో గడ్డపై ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై.. ఆపై మ్యాచ్ ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మొదటి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్వదేశానికి రావడం, సీనియర్లు గాయాల బారినపడడంతో.. భారత్ పనైపోయిందని అందరూ అన్నారు.

తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె(112) రెండో టెస్టులో శతకంతో ఆదుకోగా.. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో భారత్ రేసులోకి వచ్చింది. మూడో టెస్టులో పంత్‌ (97), అశ్విన్ (39), విహారి (23) ఆదుకున్నారు. నాలుగో టెస్టు గబ్బాలో సుందర్‌ (62), ఠాకుర్‌ (67), గిల్‌ (91), పుజారా (56), పంత్‌ (89నాటౌట్‌) అద్భుతంగా ఆడి చిరస్మరణీయ విజయం అందించారు. దీంతో భారత్ 2-1తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది.

స్పిన్ అస్రంతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించి

స్పిన్ అస్రంతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించి

చివరిగా ఇంగ్లండ్ జట్టుతో స్వదేశంలో భారత్ ఆడింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కోహ్లీసేన తర్వాత అనూహ్యంగా పుంజుకొని చివరి మూడు టెస్టుల్లో అద్భుత విజయాలు సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత స్పిన్నర్లు అశ్విన్‌ (23), అక్షర్‌ (27) మూడు టెస్టుల్లో రాణించడంతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి ముప్పుతిప్పలు పడ్డారు. రోహిత్‌ (161), అశ్విన్‌ (106) శతకాలతో మెరిశారు. ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడగా.. 12 విజయాలు, నాలుగు ఓటములను ఎదుర్కొంది. ఒక మ్యాచ్‌ డ్రా అయింది.

Story first published: Friday, June 18, 2021, 18:00 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X