న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర‌బిక్ కుతు సాంగ్‌కు వెంక‌టేశ్ అయ్య‌ర్, ఆవేష్ ఖాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

Team India cricketers Venkatesh Iyer and Avesh Khan dance to the Arabic kuthu song from Ilayathalapathy Vijay movie Beast

త‌మిళంలో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న బీస్ట్ చిత్రంలోని అర‌బిక్ కుతు సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. యూట్యూబ్‌లో ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అనేక మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్య‌ర్, ఆవేష్ ఖాన్ కూడా చేరారు. వీరిద్ద‌రు క‌లిసి అర‌బిక్ కుతు సాంగ్‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. వీడియోలో ఈ ఇద్ద‌రు హీరో విజ‌య్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ సాంగ్‌కు అనిరుధ్ సంగీతం అందించ‌గా.. జానీ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. హిరో శివ‌కార్తికేయ‌న్ లిరిక్స్ రాశాడు. హీరో విజ‌య్‌, హీరోయిన్ పూజా హెగ్డే త‌మ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకున్నారు. 23 సెక‌న్ల ఈ వీడియోకు ఇప్ప‌టికే 10 వేల లైక్‌లు, 200 కామెంట్లు వ‌చ్చాయి.

కాగా రానున్న ఐపీఎల్‌లో వెంక‌టేష్ అయ్య‌ర్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నుండ‌గా.. ఆవేష్ ఖాన్ కొత్త జ‌ట్టు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు. మెగా వేలానికి ముందే కోల్‌కతానైట్ రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్‌ వెంక‌టేష్ అయ్య‌ర్‌ను రిటైన్ చేసుకుంది. ఇక పేస్ బౌల‌ర్ ఆవేష్ ఖాన్‌ను మెగా వేలంలో 10 కోట్ల రూపాయ‌ల భారీ ధ‌ర వెచ్చింకి కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌గా ఆవేష్ ఖాన్ నిలిచాడు. కేవ‌లం 20 ల‌క్ష‌ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన ఆవేష్ ఖాన్‌ను అంత‌కు 25 రెట్లు అధికంగా చెల్లించి ల‌క్నో కొనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల‌ వెంక‌టేష్ అయ్య‌ర్ 41 స‌గటుతో 370 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 67 ప‌రుగులుగా ఉంది. ఇక బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 25 మ్యాచ్‌లు ఆడిన 25 ఏళ్ల ఆవేష్ ఖాన్ 29 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3/13 గా ఉన్నాయి.

Story first published: Friday, March 18, 2022, 12:04 [IST]
Other articles published on Mar 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X