న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్వం సిద్ధం: తొలి టెస్టుకు అడిలైడ్‌ చేరుకున్న టీమిండియా

India vs Australia 2018,1st Test : Team India Arrive In Adelaide For Test Series | Oneindia Telugu
Team India Arrive In Adelaide For Test Series Opener Against Australia

అడిలైడ్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్‌ 6నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు అడిలైడ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో మూడు రోజుల్లో మ్యాచ్ మొదలవనుండటంతో టీమిండియా ఆదివారం అడిలైడ్‌‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత్‌ ఆర్మీ ఫ్యాన్‌ క్లబ్‌ సభ్యులు విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు స్వాగతం పలికారు. టీమిండియా ఆటగాళ్లకు లభించిన సత్కారాన్ని బీసీసీఐ ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్టు‌ చేసింది.

1-0తో ఆధిక్యంలోకి వెళ్లడానికి టీమిండియా

పలువురు ఆటగాళ్లు కూడా అభిమానులతో ఫొటోలు దిగి ట్విటర్‌లో పంచుకున్నారు. సన్నాహక మ్యాచ్‌లో బౌలర్లకు, బ్యాట్స్‌మెన్లకు తగినంత ప్రాక్టీస్‌ లభించటంతో అడిలైడ్‌ టెస్ట్‌కు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లడానికి టీమిండియా తహతహలాడుతోంది. ఈసారైనా ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచి గత రికార్డులను తిరిగి రాయాలనుకుంటోంది.

సిరీస్‌ గెలవడానికి ఇదే సరైన అవకాశం

ఆసీస్‌ గడ్డపై ఇప్పటివరకు 44 టెస్టులు ఆడగా కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. సిరీస్‌ గెలవడానికి ఇదే సరైన అవకాశంగా భావిస్తోంది. చాలామంది మాజీలు కూడా ఆస్ట్రేలియాను అదే గడ్డపై ఓడించడాని ఇదే సరైన సమయమనే భావన వ్యక్తం చేస్తున్న తరుణంలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మురళీ విజయ్‌కి లైన్ క్లియరై

మురళీ విజయ్‌కి లైన్ క్లియరై

తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌ ఆడింది. ఇందులో భాగంగా శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. తొలి టెస్టులో ఆడేందుకు మురళీ విజయ్‌కి లైన్ క్లియరైంది. కానీ.. అతని పేలవ ఫామ్‌ నేపథ్యంతో.. జట్టులో స్థానం కల్పిచడంపై టీమిండియా సందేహంలో ఉంది. అయితే.. శనివారం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఫామ్‌కి తిరుగులేదని సత్తా చాటుకున్నాడు.

హార్దిక్ ఉన్నాడని.. ధోనీని వదిలేసి వెళ్లిన సాక్షి

ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా డ్రా

ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా డ్రా

ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 356/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సీఏ ఎలెవన్‌.. 544 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇలా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా డ్రాగా ముగించికుంది.

1
43623
Story first published: Monday, December 3, 2018, 11:30 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X