Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ ఉన్నాడని.. ధోనీని వదిలేసి వెళ్లిన సాక్షి

MS Dhoni Asks Hardik Pandya To Hold His Arm As Sakshi Dhoni Leaves. Watch Video | Oneindia Telugu
Ranveer, Deepika reception: MS Dhoni unleashed funny side as wife Sakshi moves out of frame - WATCH

న్యూ ఢిల్లీ: బాలీవుడ్ నూతన జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం జరిగినా ఇంకా సెలబ్రేటింగ్ మూడ్‌లోంచి బయటికి రాలేదు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితుల కోసం నిర్వహించిన ఈ మూడో రిసెప్షన్‌లో టీమిండియా క్రికెటర్లు ఎం.ఎస్.ధోనీ, హార్దిక్ పాండ్య కూడా పాల్గొన్నారు.

ఫొటోగ్రాఫ్స్ కోసం ఫోజులిచ్చేటప్పుడు

ఫొటోగ్రాఫ్స్ కోసం ఫోజులిచ్చేటప్పుడు

ధోనీ వెంట ఆయన సతీమణి సాక్షి కూడా కార్యక్రమానికి విచ్చేశారు. అయితే, రిసెప్షన్‌కు వెళ్లడానికి ముందు బయట ఫొటోగ్రాఫ్స్ కోసం ఫోజులిచ్చేటప్పుడు ఓ సరదా సన్నివేశం కనిపించింది. ఫొటోలకు పోజిలివ్వడానికి హార్దిక్‌ పాండ్యాతో వెళ్లమంటూ సాక్షి ధోనీకి సైగ చేశారు. ‘నువ్వు కూడా రా'అని సాక్షిని ధోనీ పిలిచారు. దీంతో ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజిలిచ్చారు.

రా చేయి పట్టుకో

కొన్ని సెకన్ల తరవాత ఫొటోగ్రాఫర్లంతా సాక్షిని ఇటువైపుకు రావాలంటూ కోరగా.. ధోనీని వదిలిపెట్టి సాక్షి పక్కకు వచ్చేశారు. ధోనీ ఖాళీగా మిగిలిపోవడంతో ‘రా చేయి పట్టుకో' అని నవ్వుతూ హార్దిక్‌‌తో ధోనీ చమత్కరించారు. ఈ సమయంలో అక్కడ కాసేపు అంతా నవ్వుల్లో మునిగిపోయారు. ధోనీ, హార్దిక్ ఫొటోలకు పోజిలిచ్చిన తరవాత సాక్షితో కలిసి మహీ వేడుకకు హాజరైయ్యారు.

పర్యటనకు సెలక్ట్ కాకపోవడంతో విరామంలో

పర్యటనకు సెలక్ట్ కాకపోవడంతో విరామంలో

హార్దిక్, ధోనీ, సాక్షి మధ్య జరిగిన ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. గతంలో సాక్షి బర్త్ డే ఏర్పాట్లలోనూ హార్దిక్ పాండ్యా మెరిశాడు. ధోనీతో పాటే ఉన్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. కాగా, వీరిద్దరూ ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్ట్ కాకపోవడంతో విరామంలో ఉన్నారు. ఫామ్ లేమి కారణంగా ధోనీ, గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించాలనే నెపంతో కసరత్తులు చేస్తున్నారు.

Story first published: Monday, December 3, 2018, 10:54 [IST]
Other articles published on Dec 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+