న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Syed Mushtaq Ali Trophy 2021: సెమీస్‌‌కు పంజాబ్, తమిళనాడు

Syed Mushtaq Ali Trophy 2021: Punjab Defeat Karnataka, Tamil Nadu Beat Himachal Pradesh

అహ్మదాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్, తమిళనాడు సెమీఫైనల్‌కు చేరాయి. డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక‌కు పంజాబ్ షాకివ్వగా.. హిమాచల్ ప్రదేశ్‌పై తమిళనాడు థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. మంగళవారం మొతెరా స్టేడియంలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో కర్ణాటక‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. ప్రత్యర్థి పేసర్లు సిద్దార్థ్ కౌల్(3/15), సందీప్ శర్మ(2/17) దెబ్బకు 17.2 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటైంది. అనిరుద్ధ జోషి(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

భారీ అంచనాలున్న దేవదత్ పడిక్కల్(11)తో పాటు కెప్టెన్ కరణ్ నాయర్(12) విఫలమయ్యారు. అనంతరం ఛేజింగ్‌లో 12.4 ఓవర్లు ఆడిన పంజాబ్ ఓ వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్(49 నాటౌట్), కెప్టెన్ మన్‌దీప్ సింగ్(35 నాటౌట్) సెకండ్ వికెట్‌కు 85 రన్స్ జోడించి జట్టును సులువుగా గెలిపించారు.

అపరాజిత్, షారూక్ ధనాధన్
హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో బాబా అపరాజిత్(45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీకి తోడు షారూఖ్ ఖాన్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడంతో తమిళనాడు ఐదు వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందింది. తొలుత హిమాచల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 రన్స్ చేసింంది.

కెప్టెన్ రిషీ ధవన్(35), అభిమన్యు రాణా(28) రాణించారు. బౌలర్లలో సోను యాదవ్(3/14) మూడు వికెట్లు తీశాడు. అనంతరం తమిళనాడు 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసి గెలుపొందింది. ఓ దశలో 66/5తో ఓటమి అంచుల్లో నిలిచిన టీమ్‌కు అపరాజిత్, షారూక్ సూపర్ బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్ని అందించారు.

Story first published: Wednesday, January 27, 2021, 11:17 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X