న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నవ్వుతూ తిరిగొస్తానని నా భార్యకు మాటిచ్చా.. భారత జట్టులోకి ఎంపికయ్యానంటే ఆయనే కారణం: సూర్య

Suryakumar Yadav Credits Rohit Sharma and Mumbai Indians for maiden India call up
Ind vs Eng 2021 : Suryakumar Yadav Credits Mumbai Indians Return For His Rise In Indian Cricket

ముంబై: ఇంగ్లండ్‌తో మార్చి 12 నుంచి ప్రారంభంకానున్న ఐదు టీ20ల సిరీస్‌ కోసం గత శనివారం 19 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. భారత జట్టులో ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కింది. టీమిండియాలో చోటు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సూర్యకుమార్ అన్నాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై ఎంతో నిరాశ చెందనని సూర్య చెప్పుకొచ్చాడు.

మరింత నైపుణ్యం నేర్చుకుంటా:

మరింత నైపుణ్యం నేర్చుకుంటా:

తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ ఇండియా టుడేతో మాట్లాడుతూ... 'టీమిండియాకు ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆ శుభవార్త విన్న తర్వాత నా క్రికెట్ ప్రయాణం ఒక్కసారిగా గుర్తొచ్చింది. నా కుటుంబమంతా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో కంటున్న కల ఇది. ప్రస్తుతం ఆట పరంగా ఉత్తమంగా ఉన్నా. ఏ మేరకు ప్రాక్టీస్ చేయాలో, ఎంత విశ్రాంతి తీసుకోవాలనే అంశాలపై పూర్తి అవగాహన ఉంది. భారత జట్టుకు విజయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ నుంచి ఆటలో మరింత నైపుణ్యం నేర్చుకుంటా. భారత ఆటగాళ్లందరి సాయంతో సాధ్యమైనంత వరకు నా ఆటను మెరుగుపర్చుకుంటా' అని చెప్పాడు.

 ఒంటరిగా బీచ్‌కు వెళ్లా:

ఒంటరిగా బీచ్‌కు వెళ్లా:

'ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై ఎంతో నిరాశ చెందా. అయితే కుటుంబంతో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరూ నాకు ధైర్యం చెప్పారు. శ్రమిస్తూనే ఉండమని, సమయం వచ్చినప్పుడు తప్పక అవకాశం వస్తుందన్నారు. ఆ సమయంలో నా భార్యకు "ఒంటరిగా బీచ్‌కు వెళ్తా, తిరిగివచ్చేప్పుడు నవ్వుతూ తిరిగొస్తా' అని చెప్పా. బయోబబుల్‌, ఎంపిక కాకపోవడం వంటి ఆ పరిస్థితుల్లో నా సతీమణి నాతో ఉండటం అదృష్టమే. అదే సమయంలో ముంబై జట్టుకు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. మానసికంగా సన్నద్ధమై మంచి ప్రదర్శన చేశా' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.

ఆ ఘనత రోహిత్ శర్మదే:

ఆ ఘనత రోహిత్ శర్మదే:

ముంబై ఇండియన్స్ మద్దతు వెలకట్టలేనిది. కోల్‌కతా నుంచి ముంబై జట్టులోకి వచ్చిన రోజులు ఇంకా గుర్తున్నాయి. కోల్‌కతాలో నేను ఫినిషర్ రోల్‌ని పోషించేవాడిని. ముంబై జట్టు నన్ను టాప్ ఆర్డర్‌లో ఆడించడమే కాకుండా స్వేచ్ఛగా చెలరేగిపోయే అవకాశం కల్పించింది. నెం.4లోనే కాదు కొన్ని సార్లు ఓపెనర్‌గా కూడా ఆడాను. కెప్టెన్ రోహిత్ శర్మ నాపై చాలా నమ్మకం ఉంచాడు. ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నింపేవాడు. నేను భారత జట్టులోకి ఎంపికయ్యానంటే ఆ ఘనత రోహిత్ శర్మదే' అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

16 మ్యాచ్‌ల్లో 480 పరుగులు:

16 మ్యాచ్‌ల్లో 480 పరుగులు:

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020లో ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్‌ల్లో 40 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 480 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు అవకాశం ఇవ్వని సెలెక్టర్లు.. తాజాగా ఛాన్స్ ఇచ్చారు. మార్చి 12న భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

బెంగళూరు ఆటగాళ్ల పూర్ షో.. న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు!!

Story first published: Monday, February 22, 2021, 19:16 [IST]
Other articles published on Feb 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X