న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగళూరు ఆటగాళ్ల పూర్ షో.. న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు!!

Devon Conway shine New Zealand beat Australia in first T20I

క్రైస్ట్‌చ‌ర్చ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో రాణించిన కివీస్‌.. ఆసీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచులో ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారు. బెంగళూరు తరఫున ఆడనున్న ఐదుగురు ఆసీస్ ఆటగాళ్లు జోష్‌ ఫిలిప్పి (2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ ‌(1), డేనియల్ సామ్స్ (1, 2/40), ఆడమ్ జంపా (13, 0/20), జే రిచర్డ్సన్ (11, 2/31) విఫలమవడంతో కంగారు జట్టు చిత్తుగా ఓడింది. మరోవైపు బెంగళూరు తరఫున ఆడనున్న కివీస్ పేసర్ కైల్ జెమీషన్‌‌ (1/32) కూడా నిరాశపరిచాడు.

చెలరేగిన కాన్వే:

చెలరేగిన కాన్వే:

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కివీస్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్‌ (0), టీమ్ సీఫెర్ట్ ‌(1)లు నిరాశపరిచారు. అనంతరం కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ ‌(12) కూడా ఆకట్టుకోలేదు. అయితే కెరీర్‌లో ఏడో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న దేవ‌న్ కాన్వే చెలరేగి ఆడాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో​ 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. చివరి బంతికి సింగిల్‌ మాత్రమే తీయడంతో సెంచరీని పరుగు దూరంలో మిస్సయ్యాడు.

కివీస్ బౌల‌ర్లు జ‌ల‌క్:

కివీస్ బౌల‌ర్లు జ‌ల‌క్:

ఓ ద‌శ‌లో 19 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన్ కివీస్‌కు దేవ‌న్ కాన్వే భారీ స్కోర్‌ అందించాడు. గ్లెన్‌ ఫిలిప్స్ ‌(30), జేమ్స్ నీషమ్ ‌(26)లు చివర్లో బ్యాట్‌ ఝుళిపించడంతో కివీస్‌ మంచి స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో డేనియల్ సామ్స్, జే రిచర్డ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ త‌ర్వాత చేజింగ్ మొద‌లుపెట్టిన ఆసీస్‌కు కివీస్ బౌల‌ర్లు జ‌ల‌క్ ఇచ్చారు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లు తొలి 5 ఓవ‌ర్ల‌లోనే నాలుగు వికెట్లు తీశారు. ఓ ద‌శ‌లో 19 ప‌రుగుల‌కే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆసీస్‌ ఏ దశలోనూ కివీస్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. లెగ్ స్పిన్న‌ర్ ఐస్ సోథి 4 వికెట్లు తీసుకున్నాడు. మ‌రో 2.3 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ఆస్ట్రేలియా 131 ర‌న్స్‌కు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (45; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్.

8 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసిన బెంగళూరు:

చెన్నైలో గత గురువారం జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలానికి రూ.35.40 కోట్లతో వెళ్లిన బెంగళూరు 8 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసింది. మిడిలార్డర్‌లో పవర్ హిట్టర్ లేని లోటుని గ్లెన్ మాక్స్‌వెల్‌తో భర్తీ చేసుకున్న కోహ్లీసేన.. విదేశీ పేసర్ లోటుని కైల్ జెమీషన్‌‌తో భర్తీ చేసుకుంది. ఈ ఇద్దరి కోసం 29.25 కోట్లకి వేలంలో బెంగళూరు కేటాయించింది. సచిన్ బేబీ (రూ.20 లక్షలు), రాజత్ పటిదార్ (రూ.20 లక్షలు), మహ్మద్ అజహరుద్దీన్ (రూ.20 లక్షలు), డేనియల్ క్రిస్టియన్ (రూ.4.8 కోట్లు), ప్రభుదేశాయ్ ( రూ.20 లక్షలు), కేఎస్ భరత్ (రూ.20 లక్షలు)లను బెంగళూరు కొనుగోలు చేసింది.

IPL 2021 Auction: చెన్నైతో పోటీ ముందే ఊహించి.. మాక్స్‌వెల్‌ కోసం బెంగళూరు ప్రణాళిక!!

Story first published: Monday, February 22, 2021, 18:32 [IST]
Other articles published on Feb 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X