న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైజాగ్ గడ్డపై వన్డేలాడిన కోహ్లీ ట్రాక్ రికార్డు ఇలా..

India vs Westindies 2018 2nd Odi : Virat Kohli's Recods In Vizag Stadium
Surrogate Visakhapatnam anticipates Kohlis world record

హైదరాబాద్: రెండో వన్డే మధ్యప్రదేశ్ నుంచి వైజాగ్‌కు మారడంతో టీమిండియాకు బాగా కలిసొచ్చినట్లు అయింది. ఎందుకంటే వైజాగ్ స్టేడియంలో ఆడిన ఎనిమిదింటిలోనూ ఒక్కటి మినహాయించి అన్నింటిలోనూ విజయాలే. ఈ క్రమంలో పలు రికార్డులను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరిన టీమిండియా క్రికెటర్లలో కోహ్లీ సఫలమైయ్యాడు. 81 పరుగులు చేసి.. పది వేల పరుగులు సాధించడంతో పాటు.. వెస్టిండీస్‌పై తన అద్భుత ఇన్నింగ్స్‌కు మరోసారి తెరలేపాడు.

1
44267
తొలి మ్యాచ్‌ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో

తొలి మ్యాచ్‌ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో

భారత్‌-విండీస్‌ జట్ల మధ్య విశాఖలో తొలి మ్యాచ్‌ పాతనగరం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో 1994 డిసెంబరు 7న జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. అప్పటికి కోహ్లీ భారత జట్టులోకి రాలేదు. 2011లో విండీస్‌ జట్టు రెండోసారి వై.ఎస్‌.ఆర్‌. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆడేందుకు వచ్చింది.

కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు

కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు

ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదే స్టేడియంలో 2010 అక్టోబరు 20న జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కోహ్లీ 118 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2013లో ఇదే వెస్టిండీస్‌పై కోహ్లీ సెంచరీకి ఒక్క పరుగు తేడాతో అవుట్ అయి 99పరుగులు చేశాడు.

కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం.. విశాఖ స్టేడియం

కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం.. విశాఖ స్టేడియం

2016 అక్టోబరు 29న భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక బుధవారం జరుగుతోన్న మ్యాచ్‌లో 81 పరుగులు చేసి 10వేల పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. విశాఖ స్టేడియం కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా కోహ్లీ సెంచరీ కొడతాడనే అభిమానులు ఆశిస్తున్నారు.

 డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు

డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు

సొంతగడ్డపై వన్డేల్లో అత్యంత వేగంగా 78 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి కంటే ముందు ఈ రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అందుకున్నారు. ఈ రికార్డు చేరుకోవడానికి సచిన్‌కు 92 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, ధోనికి 100 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు.

Story first published: Wednesday, October 24, 2018, 16:35 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X