న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2011 వరల్డ్‌కప్ గెలుపు క్రెడిట్ వారిదే: రైనా

Suresh Raina Says Gautam Gambhir-Virat Kohli Partnership Turning Point Of 2011 WC

న్యూఢిల్లీ: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం 28 ఏళ్ల కలను సాకారం చేస్తూ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ మధురమైన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా నాటి జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే చాలా మంది ధోనీ విన్నింగ్ షాట్‌ను షేర్ చేశారు. దీంతో ప్రపంచకప్ గెలుపు క్రెడిట్ ఎవరిదనే చర్చ మొదలైంది.

తలో చేయి వేయడంతో జట్టు ఫైనల్‌కు చేరింది. సమష్టి ప్రదర్శనతోనే అద్భుత విజయం దక్కింది. అయితే ఈ విజయాన్ని ఒక్కరికే ఆపాదించడం కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా క్రెడిట్ అంతా ధోనీకే ఇవ్వడాన్ని అంగీకరించడం లేదు. దీనిపై గౌతమ్‌ గంభీర్‌ బహిరంగంగానే విమర్శలకు దిగాడు. ధోనీ ఒక్కడి వల్లే ప్రపంచకప్ గెలువలేదని సమష్టి ప్రదర్శనతో సాధ్యమైందని ఘాటుగానే సమాధానమిచ్చాడు.

ఇక యువరాజ్ కూడా గెలుపులో తమ పాత్ర ఉందని అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై నాటి టీమ్ ప్లేయర్ సురేశ్‌ రైనా స్పందించాడు.

చిన్నప్పుడే అనుకున్నా..

చిన్నప్పుడే అనుకున్నా..

‘చిన్నప్పడు బ్యాట్‌ పట్టినప్పుడే అనుకున్నా ప్రపంచకప్‌ గెలిచే భారత జట్టులో సభ్యుడిగా ఉండాలని. ఆ కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ తాలూకు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఫైనల్‌ వరకు మా ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో ఛేదనలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం.

టర్నింగ్ పాయింట్ ఇదే..

టర్నింగ్ పాయింట్ ఇదే..

ఈ క్లిష్ట పరిస్థితిల్లో గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీ జోడి మూడో వికెట్‌కు 83 పరుగులు నమోదుచేసి విజయానికి గట్టి పునాది వేశారు. నా దృష్టిలో టీమిండియా ప్రపంచకప్‌ ఫైనల్లో గెలవడంలో ఇదే టర్నింగ్‌ పాయింటని భావిస్తాను. ఒత్తిడిలోనూ వారిద్దరూ బాధ్యతాయుతంగా ఆడిన తీరు అద్భుతం.

అందుకే ధోనీ వచ్చాడు..

అందుకే ధోనీ వచ్చాడు..

అయితే విరాట్‌ కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్‌ రావాల్సింది కానీ ఇద్దరు లెప్టాండర్స్‌ అవుతుండటం, ముత్తయ్య మురళీధరన్‌ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో సమర్థవంతంగా ఆడిన అనుభవం ఉండటంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఫైనల్‌ వంటి పోరులో మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. అయితే వికెట్లు పడకుండా, స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ధోని, గంభీర్‌లు చాలా బాగా ఆడారు. అయితే సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్‌ వెనుదిరగడం నిరుత్సాహపరిచింది. యువరాజ్‌తో కలిసి ధోని టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే గంభీర్‌-కోహ్లిలు మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేయకుంటే టీమిండియా విజయం అంత సులభం అయ్యేది కాదని నా భావన' అంటూ రైనా పేర్కొన్నాడు.

Story first published: Friday, April 3, 2020, 21:45 [IST]
Other articles published on Apr 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X