న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీతో మాట్లాడిన తర్వాతే టీమిండియాలో చోటు దక్కింది

Suresh Raina credits the former Indian captain for his successful return to the national team

హైదరాబాద్: కొన్నేళ్లుగా టీమిండియాలో పునరామనం కోసం ఎదురుచూసిన రైనా.. ఎట్టకేలకు నిదహాస్ ట్రోఫీ ద్వారా స్థానం సంపాదించుకున్నాడు. ఫామ్ లేకపోవడం, ఫిట్‌నెస్ కోల్పోవడం వంటి సమస్యలతో అతనిని టీమిండియా పక్కకుపెట్టేసింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించినా... యో యో టెస్టులో వరుసగా ఫెయిల్‌ అవ్వడంతో టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ సమయంలో ఒకసారి అనుకోకుండా భారత క్రికెట్‌ జట్టు మాజీ క్రికెట్ గంగూలీని కలిసి మాట్లాడిన మాటలు తనకు ఎంతో ఉపయోగిపడినట్లు రైనా తెలిపాడు.

గంగూలీని కలిసి మాట్లాడిన మాటలు

గంగూలీని కలిసి మాట్లాడిన మాటలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రైనా దీని గురించి చెప్పుకొచ్చాడు. 'టీమిండియాకు దూరంగా గడిపిన క్షణాలు నాకెంతో క్లిష్టమైనవి. రంజీ సీజన్‌లో అనుకున్న రీతిలో రాణించలేకపోయా. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీలో కోల్‌కతాలో బెంగాల్‌పై జరిగిన మ్యాచ్‌ నా భవిష్యత్తును మార్చింది.'

126 పరుగులతో నాటౌట్‌గా

126 పరుగులతో నాటౌట్‌గా

'ఆ మ్యాచ్‌లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాను. అంతకుముందు ఇదే టోర్నీలో ఓ మ్యాచ్‌లో తొలి రెండు బంతుల్లోనే ఔటయ్యాను. ఆ తర్వాత బెంగాల్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాను. ఈ ఇన్నింగ్స్‌ నా జట్టుకు ఎంతో ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌ తర్వాత హర్భజన్‌ సింగ్‌... గంగూలీ ఇంటికి డిన్నర్‌కి వెళ్లాం. ఆ సమయంలో చాలా విషయాల గురించి చర్చించుకున్నాం. మధ్యలో.. 2006లో ఎలా అయితే జట్టులో స్థానం కోసం ఎంత కష్టపడ్డానో ఆ సందర్భంగా గంగూలీ గుర్తు చేశాడు.'

అప్పుడు అర్థం చేసుకున్నా

అప్పుడు అర్థం చేసుకున్నా

'మళ్లీ అదే పరిస్థితుల్లో ఉన్నానని అప్పుడు అర్థం చేసుకున్నా. ఇక అప్పటి నుంచి మరో ఆలోచన లేకుండా ఫిట్‌నెస్‌ సాధించడం, ఫామ్‌పై దృష్టి పెట్టా. ఆ సందర్భంగా గంగూలీతో మాట్లాడటం ఎంతగానో కలిసొచ్చింది' అని రైనా వివరించాడు.

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు

కొద్ది రోజుల తర్వాత యో యో టెస్టు పాసవ్వడంతో ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు రైనా. ఆ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడాడు. తాజాగా వచ్చే నెలలో ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు రైనాను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, May 17, 2018, 18:24 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X