న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing 11: వార్నర్ ఇన్.. హోల్డర్ డౌట్.. ఢిల్లీతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!

Sunrisers Hyderabad Playing 11 vs DC Match 33: David Warner In And Jason Holder Doubt For IPL 2021

హైదరాబాద్: భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మరో కీలక పరీక్షకు సిద్దమైంది. రేపు( బుధవారం) జరిగే మ్యాచ్‌లో తమ కంటే చాలా బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లాడి ఒకే సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్ చేరాలంటే అద్భుతమే జరగాలి. తమకు మిగిలిన ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పోరు ఆరెంజ్ ఆర్మీకి కీలకం కానుంది.

మరో పక్క ఫస్టాఫ్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడి ఆరు విజయాలతో టేబుల్లో మంచి స్థానంలో ఉన్న ఢిల్లీ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ఏదేమైనా సెకండ్ ఫేజ్‌ను ఇరు జట్లు గెలుపుతో స్టార్ట్ చేయాలని భావిస్తుండటంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. చివర్లో జానీ బెయిర్ స్టో తప్పుకోగా.. గాయంతో ఫస్టాఫ్‌కు దూరమైన నటరాజన్ అందుబాటులోకి వచ్చాడు.

ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ ప్రదర్శన ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఫస్టాఫ్ లీగ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా.. ఢిల్లీ గెలుపొందింది. ఈ క్రమంలో రేపు జరిగే మ్యాచ్ కూడా హోరాహోరీగానే సాగనుంది. ఇక ఢిల్లీతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ తుది జట్టుపై ఓ లుక్కెద్దాం.

డేవిడ్ భాయ్ ఆగయా..

డేవిడ్ భాయ్ ఆగయా..

ఫస్టాఫ్‌లో పేలవ ప్రదర్శనతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులో చోటు ఖాయమైంది. సెకండాఫ్ ముంగిట చివరి నిమిషంలో జానీ బెయిర్ స్టో తప్పుకోవడంతో వార్నర్‌కు లైన్ క్లియరైంది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహాతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

ఇక ఫస్టాఫ్‌‌లో టీమ్ వైఫల్యానికి బాధ్యుడ్ని చేస్తూ డేవిడ్ వార్నర్‌పై సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వార్నర్‌ కెప్టెన్సీపై వేటు వేస్తూ జట్టు సారథ్య బాధ్యతలను కేన్ మామకు కట్టపెట్టింది. అయితే ఆ తర్వాత రాజస్థాన్ ఒకే ఒక మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఇక ఆ మ్యాచ్‌లో వార్నర్ డ్రింక్స్ అందించడాన్ని అభిమానులు సహించలేకపోయారు. ఈ నాలుగు నెలల సుదీర్ఘ విరామంలో వార్నర్ పూర్తిగా సెట్ అయ్యుంటాడని, పైగా టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న లీగ్ కాబట్టి మునపటి ఫామ్ కనబరుస్తాడని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరీ వార్నర్ ఏం చేస్తాడో చూడాలి.

మూడో స్థానంలో కేన్ మామ..

మూడో స్థానంలో కేన్ మామ..

ఫస్ట్‌డౌన్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనున్నాడు. ఫస్టాఫ్‌లో గాయంతో సగం మ్యాచ్‌లకు దూరంగా ఉన్న్ కేన్.. తర్వాతి మ్యాచ్‌ల్లో రాణించాడు. జట్టు మొత్తం విఫలమైనా ఒక్కడే ఆకట్టుకున్నాడు. అతనికి సరైన సహకారం లభించకపోవడంతో సన్‌రైజర్స్‌కు విజయాలు దక్కలేదు. కేన్ మామ తర్వాత మనీశ్ పాండే రానున్నాడు.

ఫస్టాఫ్‌లో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడినా అవి జట్టు విజయానికి కలిసిరాకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. సెకండాఫ్‌లో లీగ్‌లో రాణించడం వ్యక్తిగతంగా అతనితో పాటు జట్టుకు చాలా అవసరం. ఇప్పటికే టీమిండియాకు దూరమైన మనీశ్ పాండే.. వచ్చే సీజన్‌ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలంటే మెరుగ్గా రాణించాల్సిందే.

అబ్దుల్ సమద్‌కు ప్రమోషన్..

అబ్దుల్ సమద్‌కు ప్రమోషన్..

ఫస్టాఫ్‌లో లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసిన యువ హిట్టర్ అబ్దుల్ సమద్‌ను ఐదో స్థానంలో ఆడించవచ్చు. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా చేజింగ్‌లో తడబడుతున్నాడు. పేలవ షాట్లతో వికె‌ట్ ఇచ్చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సమద్‌‌ను ముందు పంపించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కేదార్ జాదవ్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే. అఫ్గాన్ స్టార్స్ మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లకు చోటు ఖాయం. బ్యాటింగ్ బలం పెంచేందుకు కొత్తగా జట్టులోకి వచ్చిన హిట్టర్ రుథర్ ఫర్డ్‌ను ఆడించాలనుకుంటే నబీ బెంచ్‌కే పరిమితమవుతాడు.

నట్టూ రీఎంట్రీ..

నట్టూ రీఎంట్రీ..

గాయంతో ఫస్టాప్ మధ్యలోనే తప్పుకున్న యార్కర్ల కింగ్ టీ నటరాజన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో నట్టూ దుమ్మురేపాడు. కచ్చితమైన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటి అన్నీ ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు.

మరీ ఈసారి కూడా నట్టూ అదే జోరు కనబరుస్తాడో లేదో చూడాలి. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌‌తో కలిసి నటరాజన్, సందీప్ శర్మ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. టీ20 ప్రపంచకప్ కూడా యూఏఈ వేదికగా జరగనున్న నేపథ్యంలో టీమ్‌కు ఎంపికైన ఆటగాళ్ల పెర్పామెన్స్‌పై సెలెక్షర్లు ఓ కన్నువేయనున్నారు. ఫస్టాఫ్‌లో విఫలమైన భువనేశ్వర్ కుమార్ తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, మహమ్మద్ నబీ/రూథర్ ఫోర్డ్/ జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్ శర్మ

Story first published: Tuesday, September 21, 2021, 17:48 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X