న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్కసారి డ్రాప్ చేశారు.. ఐపీఎలే వాయిదా పడింది! దటీజ్ డేవిడ్ భాయ్!

Sunrisers Hyderabad Fans Trends Funny Memes In Twitter after IPL 2021 suspension

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. మళ్లీ జరుగుతుందో లేదో అనేదానిపై కూడా స్పష్టత లేదు. కఠిన బయో బబుల్‌లోకి చొచ్చుకొచ్చిన మహమ్మారి వేగంగా ఆటగాళ్లను అంటుకుంది. తొలుత కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ, సందీప్ వారియర్‌కు పాజిటీవ్ రాగా.. ఆ తర్వాత అమిత్ మిశ్రా, వృద్దిమాన్ సాహా, చెన్నై కోచ్‌లు మహమ్మారి బారిన పడ్డారు.

దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. దాంతో బోర్డుకు రూ.2500 కోట్లు బొక్కపడనుంది. అయితే ఐపీఎల్ 2021 వాయిదాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరూ వాయిదా వేసి మంచి పనిచేశారంటే.. మరికొందరూ ఆ సంతోషం కూడా లేకపోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ఎస్‌ఆర్‌హెచ్ ఫుల్ హ్యాపీ..

ఎస్‌ఆర్‌హెచ్ ఫుల్ హ్యాపీ..

ఐపీఎల్ వాయిదాతో మిగతా ఫ్రాంచైజీల అభిమానుల అభిప్రాయం ఏంటిదో కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంతోషపడుతున్నారు. ఈ సీజన్‌లో అత్యంత నిరాశజనక ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లోనే విజయం సాధించింది. ఆ జట్టు ఆటతీరు చూస్తుంటే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఏమో కానీ.. పాయింట్స్ టేబుల్‌లో చిట్ట చివరి నిలిచేటట్లుందనే ఆందోళన నెలకొంది.

టీమ్ మేనేజ్‌మెంట్ వైఫల్యం, మిడిలార్డర్ బలహీనత జట్టును ఘోరంగా దెబ్బతీసింది. చివరకు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పైనే వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస ఓటములకు వార్నర్‌ను బాధ్యుడిని చేస్తూ జట్టులో నుంచి తప్పించిన టీమ్‌మేనేజ్‌మెంట్ కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినా సన్‌రైజర్స్ రాత మారలేదు.

తట్టుకోలేకపోయారు..

తట్టుకోలేకపోయారు..

వార్నర్‌ను తప్పించి రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో వార్నర్ 12వ ప్లేయర్‌గా జట్టుకు సేవలందించాడు. వాటర్ బాటిల్స్ మోస్తూ కనిపించాడు. ఇలా వార్నర్‌ను చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా టీమ్‌మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోసారు. ముంబైతో మ్యాచ్‌కు ముందు వార్నర్‌ను జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు. కానీ ఆ మ్యాచ్‌కు ముందే సాహాకు పాజిటీవ్ రావడం.. లీగ్ రద్దవడం జరిగిపోయింది.

ఒక్కసారి డ్రాప్ చేశారు..

ఒక్కసారి డ్రాప్ చేశారు..

అయితే డేవిడ్ వార్నర్‌ను పక్కనపెట్టడంతో ఐపీఎల్ ఇలా అర్దాంతరంగా ఆగిపోయిందని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సౌతిండియా హిట్ మూవీ కేజీఎఫ్‌లోని డైలాగ్స్‌తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే అందులోని ఓ డైలాగ్‌తో చేసిన మీమ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'అతన్ని ఒక్కసారి డ్రాప్ చేశారు.. ఐపీఎల్ మొత్తం వణికింది'అనే స్పూఫ్ డైలాగ్‌తో చేసిన మీమ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. డేవిడ్ భాయ్‌నే పక్కనపెట్టాలనుకుంటే ఆ దేవుడు ఐపీఎల్‌నే ఆపేశాడని కామెంట్ చేస్తున్నారు.

వార్నర్‌ను వదులుకోవద్దు..

జట్టులో చోటు గల్లంతు.. ఐపీఎల్ నిరవధిక వాయిదాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ మళ్లీ బరిలోకి దిగకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ సెకండ్ లీగ్ మళ్లీ జరిగినా వార్నర్ బరిలోకి దిగడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా వచ్చే సీజన్‌ మెగా వేలంలో అతన్ని హైదరాబాద్ వదులుకునే అవకాశం ఉందని, కేకేఆర్, రాజస్థాన్ తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వార్నర్‌ను వదులుకోవద్దని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అభిమానులు సూచిస్తున్నారు. వార్నర్ లేనిది సన్‌రైజర్స్ లేదని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, May 7, 2021, 12:26 [IST]
Other articles published on May 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X