న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ నాకు రెండో ఇల్లు.. కేకేఆర్‌ నా కుటుంబం: స్టార్ స్పిన్నర్

Sunil Narine Says India Is Like My Second Home

ఆంటిగ్వా: భారత్ తన రెండో ఇల్లు అని, ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) తనకు కుటుంబం లాంటిదని వెస్టిండీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ చెప్పాడు. కేకేఆర్ యాజమాన్యం ప్రపంచంలో ఏ టోర్నీలో ఫ్రాంచైజీని తీసుకున్నా.. దాని తరఫునే ఆడాలనుకుంటానని తెలిపాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కేకేఆర్‌కు చెందిన ట్రినిడాడ్‌ నైట్‌రైడర్స్‌ తరఫున కూడా నరైన్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కేకేఆర్‌కు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ యజమాని.

<strong>ఏ ఫార్మాటైనా బౌలర్లకే కష్టం: బ్రెట్ ‌లీ</strong>ఏ ఫార్మాటైనా బౌలర్లకే కష్టం: బ్రెట్ ‌లీ

కేకేఆర్‌ నా కుటుంబం:

కేకేఆర్‌ నా కుటుంబం:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా లైవ్‌లో తన 32వ పుట్టిన రోజైన మంగళవారం సునీల్ నరైన్‌ మాట్లాడాడు. 'కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ ఏ టోర్నీలో జట్టు‌ని కొనుగోలు చేసినా.. నేను ఆ జట్టుకి ఆడేందుకు సిద్ధం. ఇది డబ్బుకు సంబంధించింది కాదు.. కేవలం స్నేహ బంధం కోసమే. కేకేఆర్ జట్టులో ఉండటాన్ని ఇష్టపడతా. ఐపీఎల్‌ కోసం భారత్‌కి వచ్చినపుడు మంచి ఆతిథ్యాన్ని కేకేఆర్ ఇస్తోంది. అందుకే ఇండియా నాకు రెండో ఇల్లు లాంటిది, కేకేఆర్‌ నా కుటుంబం. అందువల్లే ఐపీఎల్‌లోనూ నేను సౌకర్యవంతంగా ఆడుతున్నా' అని నరైన్‌ చెప్పాడు.

ఐపీఎల్‌ను బాగా మిస్సవుతున్నా:

ఐపీఎల్‌ను బాగా మిస్సవుతున్నా:

ప్రతి ఏడాది ఐపీఎల్‌ పూర్తయ్యాక భారత్‌ను వదిలివెళ్లేటప్పుడు ఇంటిని విడిచివెళుతున్న ఫీలింగ్‌ కలుగుతుందని సునీల్ నరైన్‌ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ను తాను బాగా మిస్సవుతున్నా, అయితే త్వరలోనే లీగ్ జరుగుతుందని భావిస్తున్నా అని విండీస్ స్పిన్నర్‌ చెప్పాడు. నరైన్ కేకేఆర్‌ తరఫున ఇప్పటి వరకూ 110 మ్యాచ్‌లాడి 23.31 సగటుతో 122 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ ఎకానమీ రేట్‌ ఉన్న స్పిన్నర్‌గా 6.67తో కొనసాగుతున్నాడు. ఇటు స్పిన్నర్‌గా, అటు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నరైన్‌ కేకేఆర్‌ జట్టుకు సేవలందిస్తున్నాడు.

జీతాల గొడవ కారణంగా జట్టుకి దూరం:

జీతాల గొడవ కారణంగా జట్టుకి దూరం:

సునీల్ నరైన్ వెస్టిండీస్ జట్టుకి ఆడటం కంటే ఐపీఎల్‌లో ఆడేందుకే అధిక ప్రాధాన్యమిస్తుంటాడు. ఐపీఎల్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ప్రైవేట్ టీ20 లీగ్స్ జరుగుతున్నా అక్కడ ఆడుతుంటాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో జీతాల గొడవ కారణంగా ఆ జట్టుకి దూరమై ప్రైవేట్ లీగ్‌లలో సత్తాచాటుతున్నాడు. జాతీయ జట్టులో ఉన్నపుడు జీతాల కోసం బయటకొచ్చిన నరైన్.. ఐపీఎల్‌లో మాత్రం డబ్బుల గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పడం విశేషం. నరైన్ విండీస్ తరఫున 6 టెస్టులు, 65 వన్డేలు, 51 టీ20లు ఆడాడు. మొత్తంగా 165 వికెట్స్ తీసాడు.

ప్రయోగాత్మక ఓపెనర్‌గా:

ప్రయోగాత్మక ఓపెనర్‌గా:

ఐపీఎల్ 2018 సీజన్‌లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ప్రయోగాత్మక ఓపెనర్‌గా కోల్‌కతా ఆడించగా అతడు ప్రొఫెషనల్ ఓపెనర్‌ కంటే మెరుగ్గా రాణించడమే కాదు పరుగుల మోత మోగించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ప్రత్యర్ధి జట్టు బౌలర్లను తనదైన హిట్టింగ్‌తో బౌండరీల మోత మోగించాడు. ఎంతలా అంటే.. నరేన్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్‌కి పోటీనిస్తూ ఏకంగా 357 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్‌లో తనకు తానే సాటి. తన మిస్టరీ స్పిన్‌ను అర్ధం చేసుకోలేని ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్ వికెట్లను సమర్పించుకునేవారు. 2018 సీజన్‌లో నరేన్ 17 వికెట్లు తీశాడు. 2019 సీజన్‌లో మాత్రం అడపాదడపా మెరుపులకే పరిమితమ్మయ్యాడు. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన టోర్నమెంట్ కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, May 27, 2020, 15:47 [IST]
Other articles published on May 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X