న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏంటి ఈ పిల్ల చేష్టలు.. ఇషాన్ కిషన్‌ ప్రాంక్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్!

Sunil Gavaskar slams Ishan Kishans prank appeal, says That is not cricket

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పిల్ల చేష్టలు ఏంటని మందలించాడు. న్యూజిలాండ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోభారత ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వికెట్ విషయంలో మోసానికి పాల్పడ్డ న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌‌కు ఇషాన్ కిషన్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా.. డేరిల్‌ మిచెల్‌ వేసిన 40వ ఓవర్‌ నాలుగో బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్‌ను తాకకుండా కీపర్ టామ్ లాథమ్ చేతిలో పడింది. అయితే బెయిల్స్ కిందపడటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో పరిశీలించి ఔటిచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో టామ్ లాథమ్ గ్లోవ్స్ తాకి బెయిల్ కిందపడినట్లు రిప్లేలో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందర్నీ విస్మయపరిచింది.

ఇది మనసులో పెట్టుకున్న ఇషాన్ కిషన్.. ప్రాంక్ చేసి టామ్ లాథమ్‌ను బయపెట్టాడు. టామ్ లాథమ్ తరహాలోనే కీపింగ్ గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను పడేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. కానీ రీప్లేలో ఇషాన్ గ్లోవ్స్ తాకినట్లు తేలడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెన్రీ నికోల్స్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్.. ఎదుర్కొన్న తొలి బంతికే భారత ఆటగాళ్లు అప్పీల్ చేసారు. కుల్దీప్ వేసిన బంతిని టామ్ లాథమ్ బ్యాక్‌ఫుట్‌లో డిఫెన్స్ చేయగా.. ఇషాన్ కిషన్ బెయిల్స్ పడేసి హిట్ వికెట్ అంటూ అప్పీల్ చేశాడు. దాంతో టామ్ లాథమ్ సైతం గందరగోళానికి గురయ్యాడు. కానీ ఇషాన్ పనేనని తెలియడంతో భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు.

అదే సమయంలో ఇంగ్లీష్ కామెంట్రీ చెబుతున్న సునీల్ గవాస్కర్.. ఇషాన్ కిషన్ తీరును తప్పుబట్టాడు. 'ఇది ఏం మాత్రం పద్దతి కాదు. ఇది అసలు క్రికేట్ కాదు'అంటూ మండిపడ్డాడు. మరో కామెంటేటర్ మురళీ కార్తీక్ సైతం ఇషాన్ చేసిన పనిని విమర్శించాడు. సరాదా కోసం చేసనప్పుడు ఇషాన్ కిషన్ అప్పీల్ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అభిమానులు మాత్రం ఇషాన్ తీరును ప్రశంసిస్తున్నారు. ఇషాన్ తన చర్యతో టామ్ లాథమ్ మోసాన్ని గుర్తు చేశాడని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, January 19, 2023, 10:58 [IST]
Other articles published on Jan 19, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X