న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shubman Gill ఆ షాట్ ఆడాల్సింది కాదు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar says Wrong shot selection weighs in on Shubman Gill dismissal
Ind vs Eng 2021,3rd Test : Shubman Gill Made A Wrong Shot Selection – Sunil Gavaskar

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(11) రాంగ్ షాట్ ఆడాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అతను ఔటైన విధానం.. గిల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో మ్యాచ్ లైవ్ సందర్భంగా సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పర్యాటక జట్టే కాకుండా ఆతిథ్య జట్టూ తడబడింది. ఈ క్రమంలోనే గిల్‌ తక్కువ స్కోరుకు వెనుదిరిగి నిరాశపర్చాడు.

ఆర్చర్ బౌలింగ్‌లో..

ఆర్చర్ బౌలింగ్‌లో..

తొలుత వికెట్‌ కాపాడుకునేందుకు ప్రయత్నించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ గంటకుపైగా పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. ఆపై కాస్త కుదురుకున్నట్లు కనిపించిన గిల్‌ రెండు ఫోర్లు కొట్టి లయ అందుకున్నాడు. అయితే, ఆర్చర్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి షాట్‌ ఆడిన అతను షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమిండియా 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్‌ ఎంపిక చేసుకున్న షాట్‌ తప్పని గవాస్కర్‌ పేర్కొన్నాడు.

బంతిని స్కిడ్ చేసే..

బంతిని స్కిడ్ చేసే..

'శుభ్‌మన్ గిల్‌ రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టి ఔటయ్యాడు. అయితే, అతను తప్పుడు షాట్‌ ఎంపిక చేసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో అతని ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఎంత బాగా కష్టపడ్డా ఇలా జరుగుతూ ఉంటుంది. జోఫ్రా ఆర్చర్‌లాంటి పేసర్‌ బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ ఆడగలుగుతామని అనుకోవడం సరికాదు. ఇంగ్లండ్‌ పేసర్‌కు బంతిని స్కిడ్‌ చేసే సామర్థ్యం ఉంది. అదే ఇప్పుడు ప్రయోగించాడు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అద్భుత ప్రదర్శన కనబర్చినా శుభ్‌మన్ తప్పిదాలను రిపీట్ చేస్తున్నాడని, ముఖ్యంగా షాట్ ఎంచుకునే విషయంలో పరిపక్వత సాధించాలన్నాడు.

భారత్‌దే ఆధిపత్యం..

భారత్‌దే ఆధిపత్యం..

ప్రధాన బౌలర్‌ కాకపోయినా... అక్షర్‌ పటేల్‌ (6/38) ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్‌ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి.

100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్‌ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ 2 వికెట్లు తీశాడు.ఇక రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఏ మేరకు రాణిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ కోహ్లీసేన భారీ స్కోర్‌ సాధిస్తే ఇంగ్లండ్‌ను ఓడించే చక్కటి అవకాశం ముందుంది.

Story first published: Thursday, February 25, 2021, 16:21 [IST]
Other articles published on Feb 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X