న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజా ఆ విషయంలో బాధపడుతుండొచ్చు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar says Ravindra Jadeja is now wondering what happened to his thumb

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా ఎందుకు కోలుకోలేదనే విషయంపై బాధపడుతుండొచ్చని దిగ్గజ క్రికెటర్ సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా జడేజా బొటనవేలికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. దాంతో అతను చివరి రెండు టెస్ట్‌లతో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్‌లకు జడేజా గాయం నుంచి కోలుకోని జట్టులోకి వస్తే పరస్థితి ఏంటనే ప్రశ్న ఎదురైంది.

జడేజా ఆశ్చర్యపోతుండొచ్చు..

జడేజా ఆశ్చర్యపోతుండొచ్చు..

దీనికి తొలుత స్పందించిన లిటిల్ మాస్టర్..'తన బొటన వేలికి ఏమైందనే విషయంపై జడేజా ఇప్పుడు ఆలోచిస్తుండొచ్చు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా తన వేలు ఎందుకు నయం కాలేదని డాక్టర్‌ను అడుగుతుండవచ్చు. సిడ్నీ టెస్టు సందర్భంగా జనవరి 10న అతనికి గాయమైంది. ఫిబ్రవరి గడిచినా నయమవ్వలేదు. ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు కోలుకోలేదోనని జడేజా ఆశ్చర్యపోతుండొచ్చు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

అక్షర్‌కు రెస్ట్ ఇవ్వాలి..

అక్షర్‌కు రెస్ట్ ఇవ్వాలి..

ఇక గ్రేమ్ స్వాన్‌ మాట్లాడుతూ.. జడేజాకే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. జడ్డూ జట్టులోకి వస్తే అక్షర్‌కు విశ్రాంతినివ్వాలని సూచించాడు. 'నేను జడేజాకు వీరాభిమానిని. ఇప్పటికే అక్షర్‌ పటేల్ ఎలా ఆడాడో చూశాం. ఇప్పుడతను ఒక వారం విశ్రాంతి తీసుకోని జడ్డూకు అవకాశమివ్వాలి. ఎందుకంటే అక్షర్‌ నుంచి తగినంత మంచి ప్రదర్శన మనం చూశాం' అని ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు..

అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు..

ఇక అక్షర్‌ గురించి మాట్లాడిన గవాస్కర్‌.. గత రెండు టెస్టుల్లో పిచ్‌ అతనికి సహకరించిందని చెప్పాడు. 'వచ్చిన అవకాశాన్ని అక్షర్ పటేల్ బాగా ఉపయోగించుకున్నాడు. అతని శక్తిమేరకు బాగా బౌలింగ్‌ చేశాడు. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు సంధించడంతో పాటు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. దాంతో పలువురు బ్యాట్స్‌మెన్‌ వికెట్ల ముందు దొరికిపోయారు. 'అని సన్నీ తెలిపాడు.

అదరగొడుతున్న అక్షర్

అదరగొడుతున్న అక్షర్

ఇక చెన్నైవేదికగా జరిగిన రెండో టెస్టులో అరంగేట్రం చేసిన అక్షర్‌ పటేల్ తొలి మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక గతవారం జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో మొత్తం 11 వికెట్లతో సత్తాచాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఆ టెస్టులో అక్షర్‌ను 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు వరించింది. వాస్తవానికి ఫస్ట్ టెస్ట్‌లోనే అక్షర్ ఆడాల్సి ఉన్నా.. మోకాలి గాయం కారణంగా ఆఖరి క్షణంలో చోటు కోల్పోయాడు. లేటుగా వచ్చినా తనదైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. జడేజా లేని లోటును తీర్చాడు.

Story first published: Monday, March 1, 2021, 17:45 [IST]
Other articles published on Mar 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X