న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్ కన్నా ఐపీఎల్ పెద్ద టోర్నీ! క్యాష్ రిచ్ లీగ్ ముందు అన్నీ జుజుబీ!

 Sunil Gavaskar says IPL biggest tournament in world, even World Cups look insipid in front of it
IPL Biggest Tournament In World ప్రపంచప్ సైతం ఐపీఎల్ ముందు జుజుబీ || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ వైఫల్యానికి ఐపీఎలే కారణమని భారత అభిమానులు విమర్శిస్తున్నారు. బీసీసీఐ కాసుల కక్కుర్తి టీమిండియా కొంపముంచిందని మండిపుతున్నారు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు మానసికంగా అలసిపోయారని, అది జట్టు పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిందని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్విటర్ వేదికగా #BANIPL అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. అయితే ఈ విమర్శలపై స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భిన్న వ్యాఖ్యలు చేశాడు. అసలు ప్రపంచంలోనే ఐపీఎల్‌ పెద్ద టోర్నీ అని, ప్రపంచకప్ కన్నా ఈ లీగే గొప్పదన్నాడు.

ఐపీఎల్ ముందు ఏదీ పనికి రాదు..

ఐపీఎల్ ముందు ఏదీ పనికి రాదు..

క్యాష్ రిచ్ లీగ్ ముందు అన్నీ టోర్నీజుజుబీనేని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో లభించినంత మాజా చివరకు ప్రపంచకప్‌ల్లో కూడా ఉందన్నాడు. ఐపీఎల్‌తో పోలిస్తే టీ20 ప్రపంచకప్ ఓ బోరింగ్ టోర్నీ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బయటి దేశాల ఆటగాళ్లు, అభిమానులు ఐపీఎల్ సక్సెస్‌ను జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని, కానీ భారత అభిమానులు వారిలా మాట్లాడటం సరికాదన్నాడు. అసలు భారత జట్టులో ఆటగాళ్లందరికి ఐపీఎల్ వల్లనే స్టార్ డమ్ వచ్చిందనేది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించాడు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన గవాస్కర్ ఐపీఎల్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాడు.

ప్రపంచకప్ ఓ బోరింగ్ టోర్నీ..

ప్రపంచకప్ ఓ బోరింగ్ టోర్నీ..

ప్రపంచంలోనే మన ఐపీఎల్ బెస్ట్ డొమెస్టిక్ టోర్నమెంట్. క్యాష్ రిచ్ లీగ్‌ను మించిన టోర్నే ఈ భూమి మీద లేదు. చివరకు ప్రపంచప్ టోర్నీలు సైతం ఐపీఎల్ ముందు జుజుబీనే. ఐపీఎల్‌ను ఆస్వాదించినట్లు ప్రపంచకప్ టోర్నీలను ఆస్వాదించలేమని చాలా మంది చెబుతుంటారు. ఐపీఎల్, లోకల్ టీ20 లీగ్స్‌కు ఉన్న చరిష్మా టీ20 ప్రపంచకప్‌లో కనబడదంటారు. ఇక కొన్నిసార్లు బయటి విషయాలు కూడా టీమ్‌కు ఉపయోగపడుతాయి. టీమ్‌పై ప్రభావం చూపనంత వరకు బయటి విషయాలను పరిగణలోకి తీసుకోవచ్చు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

సెమీస్ చేరడం కష్టం..

సెమీస్ చేరడం కష్టం..

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతమే జరగాలి. హ్యాట్రిక్ విక్టరీలతో గ్రూప్2 టాపర్ పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరవని భారత్(-1.61 రన్‌రేట్) ఐదో ప్లేస్‌లో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలిచినా మనోళ్లు సెమీస్ చేరడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు టీమ్స్‌తోనే తలపడనున్న న్యూజిలాండ్ రెండింటిలో ఓడాలి, అది అసాధ్యమే అనొచ్చు. ఒక మ్యాచ్‌లో ఓడినా ప్లస్ రన్‌రేట్(0.76)తో కివీస్ ముందంజ వేసే చాన్సుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరడం చాలా కష్టం.

Story first published: Tuesday, November 2, 2021, 13:47 [IST]
Other articles published on Nov 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X