న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: సౌతాఫ్రికాతో సిరీస్ ఓటమి.. భారత ఆటగాళ్లకు ఓ పీడ కల!

Sunil Gavaskar says Dream Turned Into A Nightmare over India loss against South Africa

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా చేతిలో ఎదురైన సిరీస్ ఓటమి టీమిండియా ఆటగాళ్లకు పీడ కలగా మిగిలిపోతుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచే సువర్ణవకాశాన్ని కోహ్లీసేన చేజేతులా చేజార్చుకుందని చెప్పాడు. పేలవ బ్యాటింగ్ కారణంగానే ఈ సిరీస్‌లో భారత్‌కు పరాజయం ఎదురైందని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఏడు వికెట్లతో గెలుపొందిన సౌతాఫ్రికా 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమిపై స్పందించిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్నా..

క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్నా..

'సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ గెలుపొండంతో.. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని భావించా. అయితే, చివరి రెండు టెస్టుల్లో సౌతాఫ్రికా గొప్పగా పుంజుకుంది. ఆ రెండు టెస్టుల్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైందంటే భారత్‌ ఎంత పేలవంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చినా బ్యాట్స్‌మెన్ వైఫల్యం టీమ్ కొంపముంచింది' అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

 షమీ, బుమ్రాతో బౌలింగ్ చేయించాల్సింది..

షమీ, బుమ్రాతో బౌలింగ్ చేయించాల్సింది..

నాలుగో రోజు ఆట లంచ్ తర్వాత టీమిండియా వ్యూహాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. లంచ్ బ్రేక్ తర్వాత చివరి ప్రయత్నంగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలతో బౌలింగ్ చేయించాల్సిందన్నాడు. అందరూ ఇలానే చేస్తారని భావించారని, ఎందుకంటే విరామం తర్వాత బ్యాట్స్‌మన్ రీసెట్ అవుతారన్నాడు. ఏది ఏమైనప్పటి ఈ ఓటమి భారత జట్టుకు ఓ పీడ కలగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌ ఆరంభానికి ముందు తనతో సహా అందరూ టీమిండియానే ఫేవరెట్ అని భావించారని గవాస్కర్ తెలిపాడు.

బలహీనంగా ఉండటంతో..

బలహీనంగా ఉండటంతో..

ఎందుకంటే, భారత జట్టుతో పోల్చుకుంటే సౌతాఫ్రికాలో దాదాపు అంతా కొత్త ఆటగాళ్లే ఉన్నారని, ఆ జట్టు ప్రధాన బౌలర్ అన్రిచ్ నార్జ్‌ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో కోహ్లీ సేనకు తిరుగుండదని భావించానని, కానీ సౌతాఫ్రికా యువ ఆటగాళ్లు సత్తా చాటారని కొనియాడాడు. మొదటి టెస్టు తర్వాత సీనియర్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వంటి అంశాలు సఫారీ జట్టును మరింత బలహీనం చేసినా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ ఆత్మవిశ్వాసంతో కొత్త ఆటగాళ్లను ముందుండి నడిపించిన తీరు ప్రశంసనీయమని గవాస్కర్ కొనియాడాడు.

Story first published: Saturday, January 15, 2022, 16:52 [IST]
Other articles published on Jan 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X