న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

No. 4లో రిషబ్ పంత్: కోహ్లీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన సన్నీ

Sunil Gavaskar disagrees with Virat Kohlis move to persist with Rishabh Pant at No. 4

హైదరాబాద్: ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ (71)పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(18), రిషబ్ పంత్‌(20) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో ఐదోస్థానంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్... విరాట్‌ కోహ్లీ(120)కి మద్దతుగా నిలిచాడు.

వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ నాలుగోస్థానంలో యువ కీపర్‌ రిషబ్‌పంత్‌ను కొనసాగించాలని టీమిండియా భావిస్తోందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

<strong>బద్దలైన రికార్డులవే: సచిన్‌కి 7 సెంచరీల దూరంలో విరాట్ కోహ్లీ</strong>బద్దలైన రికార్డులవే: సచిన్‌కి 7 సెంచరీల దూరంలో విరాట్ కోహ్లీ

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంత్

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంత్

రెండో వన్డేలో అయ్యర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, NO.4 స్థానంలో రిషబ్ పంత్‌ కన్నా అయ్యరే సరిగ్గా సరిపోతాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సోనీ టెన్ 1తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "నా వ్యూ ప్రకారం... ధోనీ లాగే పంత్‌ కూడా ఐదు, ఆరు స్థానాల్లోనే మ్యాచ్‌ ఫినీషర్‌గా పనికొస్తాడని, ఆ స్థానాలే అతడి ఆటశైలికి సరిపోతాయి" అని చెప్పాడు.

విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌

40-45 ఓవర్ల పాటు కొనసాగితే..

40-45 ఓవర్ల పాటు కొనసాగితే..

"విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ 40-45 ఓవర్ల పాటు కొనసాగితే.. అప్పుడు రిషబ్ పంత్‌ నాలుగో స్థానంలో రావాలి. ఒకవేళ టాపార్డర్‌ 30-35 ఓవర్లలోపే ఔటైతే శ్రేయస్‌ అయ్యర్‌ No. 4 స్థానంలో వచ్చి, రిషబ్ పంత్ No. 5 స్థానంలో ముందు రావాలి" అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.

కెప్టెన్ కోహ్లీతో కలిసి ఆడిన అయ్యర్

కెప్టెన్ కోహ్లీతో కలిసి ఆడిన అయ్యర్

"అతడు శ్రేయస్ అయ్యర్ రెండో వన్డేలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. No. 5 స్థానంలో క్రీజులోకి రావడంతో తగినన్ని ఓవర్లు లభించాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడాడు. ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్‌తో కలిసి ఆడేటప్పుడు నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు" అని తెలిపాడు.

అయ్యర్ స్థానం సుస్థిరం అవ్వాలని

అయ్యర్ స్థానం సుస్థిరం అవ్వాలని

"ఈ ఇన్నింగ్స్‌ ద్వారా మిడిల్‌ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ స్థానం సుస్థిరం అవ్వాలని, అలా కాకపోతే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఈ మ్యాచ్‌కి ముందు విండీస్‌ ఎ జట్టుతో అయ్యర్ అనధికార ఐదు వన్డేల సిరీస్‌లోనూ ఆడాడు. ఈ సిరిస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో పాటు 88 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు" అని గవాస్కర్ మెచ్చుకున్నాడు.

1
46247
Story first published: Monday, August 12, 2019, 13:05 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X