న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ODI World Cup 2023 గెలవాలంటే.. ఆ విషయాన్ని మర్చిపోండి! టీమ్ మేనేజ్‌మెంట్‌కు సునీల్ గవాస్కర్ కీలక అడ్వైజ్!

Sunil Gavaskar’s advice to India management, no rest should be given to any player till 2023 ODI WC

న్యూఢిల్లీ: ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియాకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక అడ్వైజ్ ఇచ్చాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023‌ గెలవాలంటే ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడమనే మాట మర్చిపోవాలని సూచించాడు. ఈ మెగా టోర్నీ వరకైనా ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుసగా ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. తన కెరీర్‌లో ఏనాడు కూడా రెస్ట్ తీసుకోలేదని చెప్పిన లిటిల్ మాస్టర్.. ఒకే జట్టుతో ఆడటం వల్ల టీమ్ బలంగా తయారవ్వడంతో పాటు ఆటగాళ్ల మధ్య మంచి బంధం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇది జట్టు విజయాలకు దోహదపడుతుందన్నాడు.

విశ్రాంతి పేరిట ఆటగాళ్లను మారిస్తే..

విశ్రాంతి పేరిట ఆటగాళ్లను మారిస్తే..

తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లను ఫ్రెష్‌గా ఉంచేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ రొటేషన్ పాలసీలో వరుసగా ఆటగాళ్లకు విశ్రాంతినిస్తుంది. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. ఈ టూర్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు.

సీనియర్ల గైర్హాజరీలో జట్టుకు ఎంపికైన యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే జట్టులో ఎక్కువగా మార్పులు చేయడం జట్టుకు నష్టం చేస్తుందని తెలిపాడు. 2023 వన్డే ప్రపంచకప్ కోసం టీమ్‌మేనేజ్‌మెంట్ పకడ్బందీ ప్రణాళికను సిద్దం చేసుకోవాలని కోరాడు.

రెస్ట్.. గిస్ట్ లేదు...

రెస్ట్.. గిస్ట్ లేదు...

'ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవడం ముఖ్యమే. కానీ వన్డే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లకు విశ్రాంతినివ్వద్దు. వీలైనంత వరకు ఆటగాళ్లంతా కలిసి ఆడేలా చూడాలి. తద్వారా వారి మధ్య మంచి బంధం ఏర్పడటంతో పాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటింగ్ భాగస్వామ్యాలు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అలా పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేయాలంటే తరుచూ కలిసి ఆడాలి. చేసిన తప్పే మళ్లీ చేయవద్దు'అని గవాస్కర్ టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కోరాడు.

కోచ్‌లకు కూడా రెస్ట్..

కోచ్‌లకు కూడా రెస్ట్..

టీమ్‌మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు కోచ్‌లకు కూడా బ్రేక్ ఇస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు కోచ్ రాహుల్ ద్రవిడ్ దూరంగా ఉండగా..ఎన్‌సీఏ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే కోచ్‌లకు విశ్రాంతి ఇవ్వడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోచ్‌‌లకు విశ్రాంతి అవసరం లేదని, ఐపీఎల్ సమయంలో లభించే బ్రేక్ సరిపోతుందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. జట్టుతో ఉంటేనే కోచ్‌కు అన్ని తెలుస్తాయని అభిప్రాయపడ్డాడు. అయితే కొందరు మాత్రం కోచ్‌కు కూడా వర్క్ లోడ్ ఉంటుందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు.

ధోనీ హయాంలో..

ధోనీ హయాంలో..

టీమిండియా చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. అది కూడా ధోనీ హయాంలో 2013 ఐసీసీ ట్రోఫీ, 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన టీమిండియా.. 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో వెనుదిరిగింది. 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లోనే ఇంటిదారిపట్టింది.

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ ఓటమిపాలైంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండా వెనుదిరిగిన టీమిండియా.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లొ సెమీస్‌లోనూ ఓడింది. దాంతోనే సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు పకడ్బందీగా సిద్దం కావాలని అందరూ సూచిస్తున్నారు.

Story first published: Tuesday, November 29, 2022, 14:24 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X