న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టిమ్‌పైన్‌ సమయం ముగిసింది.. కెప్టెన్‌గా స్మిత్‌ బాధ్యతలు చేపట్టాలి: పాంటింగ్

Steve Smith Best To Take Captaincy From Tim Paine : Ricky Ponting || oneindia Telugu
Steve Smith should be made captain once Tim Paine’s time is up: Ricky Ponting

సిడ్నీ: టెస్టు కెప్టెన్‌గా టిమ్‌పైన్‌ సమయం ముగిసింది. స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపడితే చూడాలని ఉంది అని ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ రికీ పాంటింగ్‌ అన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌.. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పురాగమనం చేసినా.. అతడిపై విధించిన కెప్టెన్సీ నిషేధం ఇంకా అమల్లో ఉంది. వచ్చే మార్చిలో ఈ శిక్ష కూడా పూర్తవుతుంది.

డెన్మార్క్ ఓపెన్‌: చైనా దిగ్గజం లిన్‌ డాన్‌పై సాయిప్రణీత్‌ అద్భుత విజయం.. ప్రిక్వార్టర్స్‌లో సింధు!!డెన్మార్క్ ఓపెన్‌: చైనా దిగ్గజం లిన్‌ డాన్‌పై సాయిప్రణీత్‌ అద్భుత విజయం.. ప్రిక్వార్టర్స్‌లో సింధు!!

యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద:

యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద:

ప్రపంచకప్‌ అనంతరం స్మిత్ యాషెష్ 2019తో టెస్టుల్లో మళ్లీ పునరాగమనం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో అర్ధ సెంచరీ, నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీ, ఐదవ టెస్టులో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. స్మిత్ యాషెస్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

స్మిత్‌కు మద్దతుగా మాజీలు:

స్మిత్‌కు మద్దతుగా మాజీలు:

స్మిత్ విశేషంగా రాణిస్తుండగా.. మరోవైపు టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ప్రస్తుతం జట్టులో అతడి స్థానంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టీవ్‌స్మిత్‌ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకోవాలని ఆసీస్ మాజీలతో సహా అభిమానులు భావిస్తున్నారు. ఆసీస్‌ హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా స్మిత్‌కు మద్దతుగా ఉన్నాడు.

కెప్టెన్‌గా స్మిత్‌ని చూడాలని ఉంది:

కెప్టెన్‌గా స్మిత్‌ని చూడాలని ఉంది:

తాజాగా రికీ పాంటింగ్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ...'టిమ్‌పైన్‌ కెప్టెన్‌గా ఎన్నిరోజులు కొనసాగుతాడో అతడి ఇష్టం. ఒకవేళ అతను కెప్టెన్‌గా తప్పుకుంటే.. ఆ స్థానంలో స్మిత్‌ని చూడాలని ఉంది. ఆసీస్‌ జట్టుకు అతడే సరైన నాయకుడు. అయితే కెప్టెన్సీ విషయం పక్కనపెడితే టిమ్‌పైన్‌ అత్యుత్తమ వికెట్‌కీపర్‌. వికెట్ల వెనకాల చురుగ్గా కదులుతున్నాడు. అద్భుత క్యాచులను కూడా పడుతున్నాడు' అని అన్నాడు.

మరిన్ని విజయాలు అందిస్తాడు:

మరిన్ని విజయాలు అందిస్తాడు:

'కెప్టెన్సీ విషయమై క్రికెట్‌ ఆస్ట్రేలియా తుదినిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ స్మిత్‌ జట్టు పగ్గాలు చేపడితే.. అది అతడి బ్యాటింగ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదు. నిలకడగా పరుగులు చేస్తాడు. స్మిత్ జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తాడు. అతనిలో కసి మరింత పెరిగింది' అని రికీ పాంటింగ్‌ పేరొన్నాడు.

Story first published: Wednesday, October 16, 2019, 10:23 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X