న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్

Steve Smith says Last time we got served a green top over abandoning tour game in India

సిడ్నీ: టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2017 పర్యటనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమను మోసం చేసిందన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్పిన్ వికెట్ కాకుండా గ్రీన్ టాప్ వికెట్ రూపొందించిందని తెలిపాడు.

అసలు మ్యాచ్‌లకు మాత్రం స్పిన్ వికెట్లు తయారు చేసి ఆసీస్ టీమ్‌ను తప్పుదోవ పట్టించిందని గుర్తు చేశాడు. ఆ అనుభవం నేపథ్యంలోనే ఈసారి భారత్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడవద్దని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశాడు. భారత పర్యటనకు ముందు సిడ్నీలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని స్పిన్ వికెట్‌పై ఆడామని తెలిపాడు.

పిచ్‌‌ల్లో వ్యత్యాసం ఉంటుంది..

పిచ్‌‌ల్లో వ్యత్యాసం ఉంటుంది..

ఈ సిరీస్‌లోని నాలుగు టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు మంగళవారం భారత్ బయల్దేరింది. బెంగళూరులోని ఆలూరు వేదికగా ఆసీస్ తమ సన్నాహకాలు మొదలుపెట్టనుంది. భారత ప్రయాణానికి ముందు డైలీ టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత్‌తో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడేందుకు మేం ఎదురు చూస్తున్నాం. భారత్‌లో ప్రాక్టీస్ గేమ్ ఆడకుండా మేం సరైన నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే గత పర్యటన సమయంలో భారత్‌ పిచ్‌లకు ఏమాత్రం సంబంధం లేని గ్రీన్ టాప్ వికెట్‌ను ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్దం చేశారు.

నెట్స్‌లో ఆడటం ఉత్తమం..

నెట్స్‌లో ఆడటం ఉత్తమం..

మేం సాధారణంగా ఏ పర్యటనకు వెళ్లిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతాం. ఇంగ్లండ్‌లో కూడా ఈ పద్దతినే అనుసరిస్తాం. కానీ ఈసారి భారత్‌లో ఎలాంటి టూర్ గేమ్ ఆడవద్దని డిసైడ్ అయ్యాం. భారత్ పిచ్‌లకు సంబంధం లేని వికెట్లు తయారు చేస్తారు. దానికి బదులు నెట్స్‌లోనే స్పిన్‌‌ను ప్రాక్టీస్ చేయడం ఉత్తమం.

అందుకే సిడ్నీ వేదికగానే స్పిన్ ట్రాక్ తయారు చేసుకొని మ్యాచ్ ఆడాం. భారత్‌లో సిరీస్ గెలవడం గొప్ప విషయం. భారత్‌లో మేం టెస్ట్ సిరీస్ గెలిచి చాలా రోజు అయ్యింది. నేను రెండు సార్లు భారత పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడాను. ఉపఖండ పిచ్‌లపై ఆడటం చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే భారత్‌లో ఎదురయ్యే సవాళ్లకు మా జట్టు సిద్దంగా ఉంది'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఖవాజా సైతం..

ఖవాజా సైతం..

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండా ఆస్ట్రేలియా జట్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. తమ నెట్ ప్రాక్టీస్‌లో వీలైనంత ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కొంటే సరిపోతుందన్నాడు. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం.

Story first published: Tuesday, January 31, 2023, 19:33 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X