న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ లేమిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న స్టార్ మీడియా

Asia Cup 2018 : Broadcasters Expresses Displeasure On BCCI's Selection
Star war with BCCI over Virat Kohlis absence from Asia Cup intensifies

హైదరాబాద్: ఆసియా కప్‌ 2018కు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ దూరమైనా.. అతడే హాట్‌ టాపిక్‌గా మారాడు. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ మధ్య వాగ్వాదానికి దారి తీసింది. విరాట్‌ గైర్హాజరీతో వాణిజ్యపరంగా నష్టంతోపాటు టోర్నీలో పోటీతత్వం తగ్గుతుందని స్టార్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల అగ్రిమెంట్‌ను గౌరవించలేదని ఆరోపిస్తూ ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ)కి స్టార్‌ మెయిల్‌ చేసింది.

కోహ్లి స్థాయి కొత్తగా చెప్పనవసరంలేదు:

కోహ్లి స్థాయి కొత్తగా చెప్పనవసరంలేదు:

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్థాయి ఏంటో కొత్తగా చెప్పనవసరంలేదు. మ్యాచ్‌ ఫలితాలు ఎలా ఉన్నా అతను ఆడుతుంటే దేశం మొత్తం మ్యాచ్‌ చూడటం మాత్రం ఖాయం. ఇప్పుడతను సుదీర్ఘ షెడ్యూల్‌ నుంచి విశ్రాంతి కోరుకుంటూ ఆసియా కప్‌కు దూరమయ్యాడు. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగితే భారత్‌ మాత్రం కోహ్లిని పక్కన పెట్టిందని... ఏసీసీతో తాము చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని ఆరోపించింది.

బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్‌లు

బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్‌లు

కోహ్లీ అవుటైన వెంటనే వ్యూయర్‌షిప్‌ ఎలా తగ్గుతుందో కొన్ని విశ్లేషణలను కూడా జత చేసింది. గతంలో కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్‌లు రావడం, అతను ఔట్‌ కాగానే పడిపోయిన విషయాన్ని కూడా స్టార్‌ గుర్తు చేసింది. భారీ మొత్తం చెల్లించి ఏసీసీతో ఎనిమిదేళ్ల కాలానికి స్టార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్‌కు విశ్రాంతినివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమతో పాటు టోర్నీతో సంబంధం ఉన్న అనేక సంస్థలకు వాణిజ్యపరంగా నష్టదాయకమని పేర్కొంది.

ఘాటుగా స్పందించిన బీసీసీఐ

ఘాటుగా స్పందించిన బీసీసీఐ

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశం టోర్నీకి ఆదాయం తెచ్చిపెట్టే వనరులను బాగా దెబ్బతీస్తున్నది అని ఏసీసీ గేమ్ డెవలప్‌మెంట్ మేనేజర్ తుసిత్ పెరెరా మెయిల్‌లో రాశాడు. దీనిపై స్పందించిన బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ.. మా జట్టు ఎంపికలో మీ ప్రమేయం అవసరం లేదు. ప్రసారదారులు జట్టును ఎంపిక చేయలేరు. మాకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును ప్రకటించాం. బీసీసీఐకి ఉండే హక్కు ఇది.

ఎంపిక చేయడం, చేయకపోవడం మా ఇష్టం

ఎంపిక చేయడం, చేయకపోవడం మా ఇష్టం

కోహ్లీని ఎంపిక చేయడం, చేయకపోవడం మా ఇష్టం. ఫలానా వ్యక్తినిగానీ లేదా అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించే హక్కుగానీ ఏసీసీ, ప్రసారకర్తలకు లేదు అని ఘాటుగా సమాధానమిచ్చాడు.యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో మంగళవారం హాంకాంగ్‌తో, ఆ తర్వాత బుధవారం పాకిస్తాన్‌తో తలపడుతుంది.

Story first published: Monday, September 17, 2018, 11:56 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X