న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకపై టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

Sri Lanka vs South Africa Live Score, CWC 2019: Faf du Plessis wins the toss and South Africa will bowl first

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సఫారీలు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జేపీ డుమిని, ప్రిటోరియస్ స్థానంలో డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడిలు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా, శ్రీలంక ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి రెండు ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

నాకౌట్‌కు చేరాలంటే లంక తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. దీంతో సౌతాఫ్రికాపై నెగ్గి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన గట్టి పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో లంక బరిలోకి దిగనుంది.

1
43678

మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో సఫారీలకు ఇది నామమాత్రపు మ్యాచ్ కాగా, శ్రీలంకకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. శ్రీలంక ఇది గెలిస్తే ఏడు పాయింట్లతో ఉన్న పాక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్తుంది. కాగా, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు జరిగాయి.

ఇందులో శ్రీలంక 31 మ్యాచ్‌ల్లో నెగ్గగా దక్షిణాఫ్రికా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మరోదాంట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు ఐదు సార్లు ఎదురుపడగా మూడుసార్లు దక్షిణాఫ్రికా, ఒకసారి లంక గెలిచాయి. మరో మ్యాచ్‌ (2003 కప్‌లో) టైగా ముగిసింది.

{headtohead_cricket_6_7}

జట్ల వివరాలు:

శ్రీలంక జట్టు: కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఏంజిలో మాథ్యుస్‌, ధనంజయ డిసిల్వ, థిసారా పెరీరా, జీవన్‌ మెండిస్‌, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, సురంగ లక్మల్‌

దక్షిణాఫ్రికా: హషీమ్‌ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), మార్‌క్రమ్‌, వాన్‌ డర్‌ డుస్సెన్‌, జేపీ డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, క్రిస్‌ మోరిస్‌, రబాడ, ఇమ్రాన్‌ తాహిర్‌

Story first published: Friday, June 28, 2019, 15:06 [IST]
Other articles published on Jun 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X