న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: న్యూజిలాండ్ తరుపున నాలుగో బౌలర్‌గా టిమ్‌ సౌథీ

Sri Lanka vs New Zealand: Tim Southee follows new-ball partner Trent Boult to 250 Test wickets

హైదరాబాద్: న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో న్యూజిలాండ్‌ తరఫున 250 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో ఇటీవలే కొలంబో వేదికగా జరిగిన తొలి టెస్టులో ట్రెంట్ బౌల్ట్ సైతం 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

కాగా, శ్రీలంకతో సారా ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టిమ్ సౌథీ శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నేను ఔట్‌ చేయడం ద్వారా 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు 245 టెస్టు వికెట్లతో ఉన్న టిమ్ సౌథీ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించాడు.

<strong>తొలి ఇన్నింగ్స్‌లో అలసట: విండిస్‌పై ఆరు వికెట్లు తీయడంపై బుమ్రా</strong>తొలి ఇన్నింగ్స్‌లో అలసట: విండిస్‌పై ఆరు వికెట్లు తీయడంపై బుమ్రా

రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు

రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు

ఇక, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో ఈ మైలురాయిని అందుకున్నాడు. తనతో కలిసి కొత్త బంతిని పంచుకునే మరో న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 250 వికెట్ల మార్కును చేరిన మూడు రోజుల్లోనే టిమ్ సౌథీ కూడా ఈ మైలురాయిని అందుకోవడంతో కివీస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

67వ టెస్టు మ్యాచ్‌లో

టిమ్ సౌథీ తన 67వ టెస్టు మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో రిచర్డ్‌ హ్యాడ్లీ(431) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో డానియెల్‌ వెటోరి(361) ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్‌, టిమ్ సౌథీలు ఉన్నారు.

53వ టెస్టులో 250వ వికెట్‌ను

53వ టెస్టులో 250వ వికెట్‌ను

1985లో రిచర్డ్‌ హ్యాడ్లీ తన 53వ టెస్టులో 250వ వికెట్‌ను అందుకోగా... ట్రెంట్ బౌల్ట్ తన 64వ టెస్టులో అందుకోవడం విశేషం. కాగా, టిమ్ సౌథీ 2008లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే, రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మీరే చూడండి: బంతిని కాదు లియాన్ జారవిడించింది.. యాషెస్ ట్రోఫీని! (వీడియో)

రెండో టెస్టులో కివీస్ విజయం

రెండో టెస్టులో కివీస్ విజయం

తన తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 431/6 వద్ద డిక్లేర్‌ చేయగా.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక 122 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా(51) మినహా ఎవరూ రాణించలేదు. బౌల్ట్‌, సౌతీ, అజార్‌ పటేల్‌, సోమర్‌విల్లేలు తలో రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమం అయింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, August 26, 2019, 17:57 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X