న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో లసిత్ మలింగ సరికొత్త రికార్డు.. ఆఫ్రిది రికార్డు బ్రేక్!!

Sri Lanka vs New Zealand: Lasith Malinga to become leading wicket-taker in T20Is

పల్లెకెలె: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మలింగ రెండు వికెట్లు తీసాడు. దీంతో మొత్తం 99 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

గాఫ్‌ జోరుకు ఒసాకా బ్రేక్‌.. బార్టీకి షాక్.. క్వార్టర్స్‌లో ఫెడరర్‌గాఫ్‌ జోరుకు ఒసాకా బ్రేక్‌.. బార్టీకి షాక్.. క్వార్టర్స్‌లో ఫెడరర్‌

టీ20ల్లో అత్యధిక వికెట్లు:

టీ20ల్లో అత్యధిక వికెట్లు:

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్‌ కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ ఖాతాలో 99 వికెట్లు చేరాయి. దీంతో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా పాక్ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. తాజాగా ఆ రికార్డును మలింగ బద్దలు కొట్టాడు. మలింగ 74 మ్యాచులలో 99 వికెట్లు తీస్తే.. ఆఫ్రిది 99 మ్యాచులలో 98 వికెట్లు తీసాడు.

 షకీబ్ @ 3:

షకీబ్ @ 3:

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షాహిద్ అఫ్రిది తరువాత బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ (88 వికెట్లు) మూడవ స్థానంలో ఉన్నాడు. పాక్ మాజీ బౌలర్లు ఉమర్ గుల్ (85 వికెట్లు), సయీద్ అజ్మల్ (85 వికెట్లు).. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (75 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత కివీస్ కెప్టెన్ టిమ్ సౌతీ 69 వికెట్లతో 7వ స్థానంలో ఉన్నాడు.

కివీస్ విజయం:

కివీస్ విజయం:

ఈ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్లతో గెలిచింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఇంకా మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. గ్రాండ్‌హోమ్‌ (44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్‌ టేలర్‌ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మలింగ, అరంగేట్ర లెగ్‌స్పిన్నర్‌ హసరంగా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక 20 ఓవర్లలో 174/4 స్కోరు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (53 బంతుల్లో 79; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. సౌథీ రెండు వికెట్లు తీశాడు.

కేవలం టీ20లు మాత్రమే:

కేవలం టీ20లు మాత్రమే:

ప్రత్యేకమైన బౌలింగ్ శైలి, యార్కర్లతో 15ఏళ్లుగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన మలింగ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు పలికాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు మలింగ ఆడనున్నాడు.

వెస్టిండీస్‌ లక్ష్యం 468.. భారత్ విజయానికి 8 వికెట్లు

226 వన్డేలు 338 వికెట్లు:

226 వన్డేలు 338 వికెట్లు:

2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున మురళీధరన్ (534), వాస్ (400) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు. మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక ఆటగాడు మలింగ. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్‌లు చేసిన ఆటగాళ్లు మలింగ, వసీమ్‌ అక్రమ్‌ మాత్రమే.

Story first published: Monday, September 2, 2019, 12:55 [IST]
Other articles published on Sep 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X