న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

17వ సెంచరీ డచ్ ఫోర్ట్ కోసం గాలె స్టేడియాన్ని కూల్చుతున్నారు

By Nageshwara Rao
Sri Lankas Galle Stadium Could Be Demolished To Save 17th Century Dutch Fort

హైదరాబాద్: అంతర్జాతీయ ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఒకటి. ఈ ఐకానిక్ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్‌లో వచ్చి సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది.

ఆ తర్వాత ఈ స్టేడియానికి మరమ్మతులు చేశారు. అయితే, తాజాగా ఈ స్టేడియానికి ఆనుకొని ఉన్న 17వ శతాబ్దానికి చెందిన డచ్‌ఫోర్ట్‌ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.

Sri Lankas Galle Stadium Could Be Demolished To Save 17th Century Dutch Fort

స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ వల్ల కోట గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా, స్టేడియంలో నిర్మించిన 500 సీట్ల సామర్థ్యం కలిగిన పెవిలియన్ స్టాండ్ వల్ల వారసత్వ జాబితాలో చోటు కోల్పోయే ప్రమాదంలో ఉంది.

ఈ విషయాన్ని శ్రీలంక సాంస్కృతిక శాఖ మంత్రి విజయదాస రాజపక్సే పార్లమెంట్‌లో వెల్లడించారు. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో గాలెలోనే మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు. గాలె పిచ్ స్పిన్‌కు అనుకూలం.

1998 తరువాత గాలె వేదికగా జరిగిన చాలా మ్యాచ్‌ల్లో శ్రీలంక ఘన విజయాలు సాధించింది. ఈ స్టేడియంలో శ్రీలంక జట్టుకు ఓ లక్కీ స్టేడియం. గత వారంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ పోర్ట్‌ని 1505లో పోర్చుగీస్ వారు నిర్మించారు. 1640 వరకు ఇక్కడే ఉన్న పోర్చుగీస్ వారు ఈ ఐలాండ్‌లో అనేక బిల్డింగ్స్‌ను నిర్మించారు. అందులో ఒకటి డచ్ ఫోర్ట్. 1796లో పోర్చుగీస్ వారి నుంచి బ్రిటిష్ సైన్యం గాలెను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఈ కోటను శ్రీలంక టూరిజం శాఖ ఆధీనంలో ఉంది.

''తక్షణమే స్టేడియాన్ని తొలగించరు. కోటకు ఉన్న వారసత్వ సంపద గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. క్రికెట్‌ మైదానానికి మరో ప్రత్యమ్నాయం చూడాలి'' అని క్రీడా శాఖ మంత్రి ఫైజర్‌ ముస్తఫా చెప్పాడు. నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచే గాలె స్టేడియంలో చివరి మ్యాచ్‌ కానుందని అధికార వర్గాలు తెలిపాయి.

Story first published: Saturday, July 21, 2018, 11:10 [IST]
Other articles published on Jul 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X