న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4 బంతుల్లో 4 వికెట్లు.. ఐదు హ్యాట్రిక్‌లు.. ఆ అరుదైన రికార్డులు మలింగకే సాధ్యం!!

Sri Lanka legend Lasith Malinga turns 37

హైదరాబాద్: క్రికెట్‌లో యార్కర్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు లసిత్ మలింగ. శ్రీలంకకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఓవర్లోని ఆరు బంతులను యార్కర్లుగా సందించగలడు. సరిగ్గా బ్యాట్స్‌మెన్ పాదాల వద్ద యార్కర్లని విసిరే మలింగ.. ఎంతో మంది టాప్ బ్యాట్స్‌మెన్‌లను సైతం బోల్తా కొట్టించాడు. చివరి ఓవర్లలో ఎన్నో యార్కర్లు సంధించి తన జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతలను ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (ఆగస్టు 28) మలింగ 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

 హ్యాపీ బర్త్ డే మలింగ:

హ్యాపీ బర్త్ డే మలింగ:

1983 ఆగస్టు 28న జన్మించిన లసిత్ మలింగ 11 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం మొదలెట్టాడు. ఇక 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. లంక తరఫున ఇప్పటి వరకూ 30 టెస్టులు, 226 వన్డేలు, 83 టీ20 మ్యాచ్‌లాడిన మలింగ.. 546 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఘనతలు సాధించాడు. హ్యాపీ బర్త్ డే లసిత్ మలింగ.

ఐదు హ్యాట్రిక్ వికెట్లు:

ఐదు హ్యాట్రిక్ వికెట్లు:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు సార్లు హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేసిన తొలి బౌలర్‌గా లసిత్ మలింగ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో మూడు, టీ20ల్లో రెండు హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇక నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు రెండుసార్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2007లో మలింగ తొలిసారి నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు. గతేడాది సెప్టెంబర్‌లో పల్లెకెలె వేదికగా కివీస్‌తో జరిగిన టీ20లో మరోసారి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మున్రో, రూథర్‌ఫోర్డ్, గ్రాండ్‌హోమ్‌,టేలర్‌లను ఔట్ చేశాడు.

టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి:

టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి:

టీ20 క్రికెట్‌లో ఇప్పటికే 107 వికెట్లు పడగొట్టిన మలింగ.. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతని బెస్ట్ 5/6. పంచకప్‌లో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక ఆటగాడు మలింగ. శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ మలింగ (338). ముత్తయ్య మురళీధరన్ (523), చమింద వాస్‌ (399)లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. టెస్టులు, వన్డేలకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన లసిత్ మలింగ.. టీ20ల్లో మాత్రం ఇంకా కొనసాగుతున్నాడు.

మలింగ మరిన్ని రికార్డులు:

మలింగ మరిన్ని రికార్డులు:

# ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు మలింగ. 29 మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టాడు. మెక్‌గ్రాత్‌ (71), ముత్తయ్య మురళీధరన్‌ (68) ముందున్నారు.

# ప్రపంచకప్‌-2019లో మలింగ 13 వికెట్లు పడగొట్టి శ్రీలంక తరఫున టాప్‌ బౌలర్‌గా నిలిచాడు.

# శ్రీలంక తరఫున బౌలింగ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ (32.4)ను కలిగి ఉన్న రెండో బౌలర్‌ మలింగనే. అజంతా మెండిస్‌ తొలి స్థానంలో ఉన్నాడు.

# శ్రీలంక తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అర్ధ శతకం బాదాడు.

మైదానంలో భారీ సిక్సర్ బాదాడు.. సొంత కారు అద్దాలనే పగులగొట్టుకున్నాడు!!

Story first published: Friday, August 28, 2020, 16:51 [IST]
Other articles published on Aug 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X