మైదానంలో భారీ సిక్సర్ బాదాడు.. సొంత కారు అద్దాలనే పగులగొట్టుకున్నాడు!!

డబ్లిన్: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ ఆడే సిక్సులు మైదానం ఆవల పడడం సహజమే. కొన్ని షాట్లు స్టేడియాలు దాటిపోతే.. మరికొన్ని గ్యాలరీలోని అద్దాలను పగులగొడతాయి. అప్పుడప్పుడు కొందరు కొట్టే సిక్సర్‌లు అభిమానులను గాయపరుస్తుంటాయి కూడా. అయితే ఐర్లాండ్ భారీ హిట్టర్ కెవిన్ ఓబ్రియన్ తాజాగా కొట్టిన ఓ సిక్స్ మాత్రం వీటన్నింటికీ పూర్తి భిన్నం. షాట్ ఆడిన ఓబ్రియన్‌కే.. అది జీవితకాలం గుర్తుండి పోనుంది. విషయంలోకి వెళితే...

సంచలన ఇన్నింగ్స్:
ఐర్లాండ్‌లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం డబ్లిన్ వేదికగా నార్త్‌వెస్ట్ వారియర్స్, లీన్‌స్టర్ లైటనింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆట ప్రారంభంలోనే వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన లీన్‌స్టర్ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ ఒబ్రెయిన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతులెదుర్కొని 82 పరుగులు చేశాడు. మొత్తం కెవిన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో లీన్‌స్టర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

భారీ సిక్సర్ బాదాడు:
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌వెస్ట్ వారియర్స్ 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. పోర్టర్ ఫీల్డ్ (50) అర్ధ శతకంతో రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్ లేక ఆ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో స్టార్ ఆఫ్ ది పర్సన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ నిలిచాడు. అయితే కెవిన్ కొట్టిన 8 సిక్సుల్లో ఒక బంతి వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న ఓ కారు అద్దాలను ధ్వంసం చేసింది. మాములుగా మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులదో లేక వేరే వారిదో అని ఊహిస్తాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

కారు అద్దాలు ధ్వంసం:
కెవిన్ ఓబ్రియన్ కొట్టిన సిక్స్.. అతని కారు అద్దాలనే ధ్వంసం చేసింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని భావించిన కెవిన్ పార్క్ చేసిన తన కారు దగ్గరకు వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే తాను కారు కొన్న టయోటా షోరూమ్‌కు కారును తీసుకెళళ్ళాడు. ఇక కారును ఇన్సురెన్స్ కోటా కింద రిపేయిరింగ్ చేస్తున్నారు. అయితే రిపేరింగ్‌కు వెళ్లే ముందు తన కారుతో కొన్ని ఫోటోలు దిగాడు కెవిన్. వీటిని టయోటా తన ట్విటర్‌లో షేర్ చేసింది.

అస్సలు ఊహించలేదు:
టయోటా ట్విట్‌పై కెవిన్ ఓబ్రియన్ సరదాగా స్పందించాడు. 'ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నేను కొట్టిన సిక్స్.. నా కారు అద్దాలను ధ్వంసం చేసింది. ఇక మీదట నా కారును గ్రౌండ్ ఆవల చాలా దూరంలో పార్క్ చేస్తా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అయితే కెవిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. గతంలో ఓసారి ఇలానే ఓబ్రియన్ కొట్టిన సిక్స్‌తో అతని కారు డోర్ దెబ్బతింది. అది ప్రాక్టీస్ సెషన్ కావడంతో.. పిచ్‌కి దగ్గరగా పార్క్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
'ఈ క్షణం కోసం రెండేళ్లుగా వేచిచూస్తున్నా.. ఇక ఆగలేను'